Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీడీఎస్ సూపర్వైజర్ సుమతి
నవతెలంగాణ-గోవిందరావుపేట
అంగన్వాడి కేంద్రంలో నమోదైన చిన్నారులకు సంపూర్ణ పోషకాహారం అందించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ సుమతి తెలి పారు. మండలంలోని రాంనగర్ తండాలోని అంగన్వాడీ కేంద్రంలో కేర్ ఇండియా స్వచ్ఛంద సేవా సంస్థ సౌజన్యంతో మంగళవారం నిర్వహించిన పోషణ మాసం కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. గర్భిణులు, బాలింతలు, ఆరేండ్లలోపు వయ స్సున్న చిన్నారులను రక్తహీనత నుంచి కాపాడేందుకు వైద్య ఆరోగ్యశాఖ సమన్వ యంతో ప్రత్యేక పరీక్షలు నిర్వహించి పౌష్టికాహారం అందేలా కషి చేస్తున్నా మన్నారు. అంగన్వాడీ కేంద్రంలో నమోదైన చిన్నారుల ఎత్తు, బరువు కొలతలు తీసి పోషణ లోపం ఉన్న చిన్నారులను గుర్తించి వారికి సంపూర్ణ ఆహారం అందించి వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారు చేస్తున్నట్లు తెలిపారు. విటమిన్స్, మినరల్స్ అన్ని రకాల పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు. కేర్ ఇండియా సీఆర్పీ రూప్సింగ్ మాట్లాడుతూ పోషకాహారం, విటమిన్స్, మినరల్స్ గురించి గర్భిణులకు, బాలింతలకు వివరిం చారు. అనంతరం గర్భిణులకు, బాలింతలకు క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అంగన్వాడి టీచర్లు, ఆశ కార్యకర్తలు, వార్డ్సభ్యులు, ఎస్‌హెచ్‌జీ లీడర్లు, తదితరులు పాల్గొన్నారు.