Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
మండల పరిషత్ కార్యాలయంలో డీఎఫ్ఓ అవినాష్, ఎంపీడీఓ రామయ్యతో కలిసి ఎంపీపీ దావు వినోద వీరారెడ్డి, జెడ్పీటీసీ గొర్రె సాగర్ మత్స్యకారులకు ఉచిత చేప పిల్లలను పంపిణీ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని మామిడి కుంట చెరువులో చేప పిల్లలను వదిలేశారు. మండలంలోని సొసైటీలకు మొత్తం 46 చెరువుల్లో 11.62 లక్షల చేప పిల్లల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సాగర్ మాట్లాడారు. మత్స్యకారులు అర్థిక పురోభివద్ధి సాధించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి చిత్తశుద్ధితో అమలు చేస్తోందన్నారు. మత్స్యకార్మికులు చేప పిల్లల అమ్ముకోవడానికి సబ్సిడీ ద్వారా వాహనాలు మంజూరు చేసి వారి అభివద్ధి కోసం ప్రభుత్వం పాటుపడుతోందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ డబ్బెట అనిల్, మండల కోఆప్షన్ సభ్యుడు రాజ్మహ్మద్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆరెపల్లి మల్లయ్య, నాయకులు కొత్తూరు రాజిరెడ్డి, ఎల్లేటి రాజు, గోల్కొండ సారయ్య, ఆకుల రవి, గుండా స్వామి, బండి సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.