Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మొగుళ్లపల్లి
మొగుళ్లపల్లికి గతంలో ఉన్న నైట్ హాల్ట్ బస్సు సర్వీసును పునరుద్ధరించాలని సర్పంచ్ మోటె ధర్మారావు, ఎంపీటీసీ వనిత పున్నం చందర్రావు పరకాల డిపో మేనేజర్ కష్ణమూర్తి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కృష్ణకుమారిలను కోరారు. ఈ మేరకు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ ధర్మారావు, ఎంపీటీసీ వనిత పున్నంచందర్ ఆధ్వర్యంలో మంగళవారం 'ప్రజల వద్దకే ఆర్టీసీ సేవలు' కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్యఅతిథులుగా పరకాల డిపో మేనేజర్ కష్ణమూర్తి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కృష్ణకుమారి హాజరయ్యారు. డిపో మేనేజర్ ఆర్టీసీ సేవల కోసం వివరణ కోరగా సర్పంచ్, ఎంపీటీసీలు మాట్లాడారు. హన్మకొండ, పరకాల, జమ్మికుంట లాంటి పట్టణాలకు వెళ్లేందుకు ప్రయాణికులు చుట్టు పక్క గ్రామాల నుంచి మొగుళ్లపల్లికి చేరుకొని ఇక్కడి నుండి అనుకున్న సమయంలో ఆర్టీసీ బస్‌లు లేకపోవడంతో ప్రయివేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. మండలం నుండి 20 కిలోమీటర్ల దూరంలో జమ్మికుంట రైల్వేస్టేషన్ ఉండడం వల్ల ఉదయం రామగిరి, భాగ్య నగర్ ట్రైన్లలో వేరే ప్రాంతాలకు ప్రయాణం చేయాలనుకునే వారికి ఉదయం బస్ సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొని గమ్యస్థానాలకు చేరుకుంటున్నారని తెలిపారు. రైతులు ధాన్యం అమ్మకాలు జరిపేందుకు హన్మకొండ వ్యవసాయ మార్కెట్‌కు ఎక్కువగా వెళుతుంటారని తిరుగు ప్రయాణంలో పరకాల నుండి రాత్రి 8.30 దాటితే బస్ సౌకర్యం లేక పోవడంతో ప్రయివేట్ వాహనాల్లో ఎక్కువ డబ్బులు చెల్లించి గమ్యం చేరుకునే పరిస్థితి ఉందన్నారు. ఆర్టీసీ డ్రైవర్లు బస్టాండ్ కూడలిలో బస్ కనీసం రెండు నిముషాలు కూడా ఆపకుండా వారి ఇస్టానుసారం ప్రయాణికులు దిగడంతో బస్ వెళ్తున్నాయని వివరించారు. వెంటనే గ్రామంలో ఉదయం ఒక బస్‌తోపాటు నైట్ హాల్ట్ బస్ సర్వీసును కొనసాగించాలని డిపో మేనేజర్‌ను కోరారు. డిపో మేనేజర్ మాట్లాడుతూ సర్పంచ్, ఎంపీటీసీల కోరిక మేరకు ప్రయాణికుల సౌకర్యార్థం వివిధ రూట్లలో బస్సులను నడిపిస్తామని చెప్పారు. ఆర్టీసీని సద్వినియోగం చేసుకొని సంస్థ అభివద్ధికి ప్రయాణికులు తోడ్పాటు అందించాలని కోరారు. అనంతరం గ్రామ శివారులో నిర్మాణం మధ్యలోనే ఆగిన ఆర్టీసీ బస్టాండ్ ప్రదేశాన్ని పరిశీలించారు. సమావేశంలో జీపీ సెక్రటరీ నరేష్, ఉపసర్పంచ్ పడిదల సరోజన బాపురావు, గ్రామస్తులు క్యాతారాజు రమేష్, ముడుపు రవి, దేవునూరి కుమారస్వామి, పొతంగల్ జనార్ధన్, గుడిమల్ల రమేష్, మహ్మద్ సర్వర్ పాషా, మోటే శ్రీధర్, క్యాతారాజు రాజయ్య, ఉడుత మొండయ్య తదితరులు పాల్గొన్నారు.