Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్ భూక్య దేవ్‌సింగ్
నవతెలంగాణ-గోవిందరావుపేట
విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేయాలని విశ్రాంత మున్సిపల్ కమిషనర్ భూక్య దేవ్ సింగ్ అన్నారు. మంగళవారం మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విద్యార్థులకు సందేశమిచ్చి జ్యూట్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దేవ్ సింగ్ మాట్లాడుతూ ఏడు నెలలుగా విద్యార్థుల కోసం నిర్విరామ కషి చేస్తున్నానని తెలిపారు. వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా వారికి సంబంధించిన స్టడీ మెటీరియల్ అందిస్తున్నారని చెప్పారు. అలాగే తాను ఈ కళాశాలకు పూర్వ విద్యార్థినని, ఇదే కళాశాలలో చదువుకొని ఉన్నత ఉద్యోగ లక్ష్యాన్ని చేరేందుకు ఇక్కడ నుండే పునాదులు వేసుకున్నానని చెప్పారు. తాను చదువుకున్న రోజులు గుర్తు చేస్తూ అందరూ కష్టపడి చదివి మంచి ఫలితాలను సాధించి భవిష్యత్తులో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని కోరారు. గతంలో ఇదే కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు ఎంసెట్, నీట్ స్టడీ మెటీరియల్ అందజేశానని గుర్తు చేస్తూ ప్రస్తుత విద్యార్థులందరికీ కూడా మీకు చదువుకోవడానికి కావాల్సిన అన్ని రకాల స్టడీ మెటీరియల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం వాతావరణంలో మార్పుల వల్ల ప్రస్తుతం వస్తున్న వ్యాధులకు సంబంధించి అన్ని రకాల సమాచారం విద్యార్థులకు తెలియజేసేలా పాంప్లెంట్లు రూపొందించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ అందించారు. వాటితోపాటు కళాశాలలోని అందరి విద్యార్థులకు దాదాపు 100 జూట్ బ్యాగులను అందించారు. కార్యక్రమంలో సామాజికవేత్త దొంతి విజేందర్‌రెడ్డి, సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోరిక రాహుల్ నాయక్, సేవాలాల్ సేన ములుగు అధ్యక్షుడు బాదావత్ రాజ్‌కుమార్, కళాశాల అధ్యాపకులు వెంకన్న, హిమబింద, శోభారాణి, రజియా, స్వర్ణలత, హరికష్ణ, అనిత, గణపతి, తదితరులు పాల్గొన్నారు.