Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు తుమ్మల వెంకట్రెడ్డి
- ఏజెన్సీలో గ్రామాల్లో విస్తృత పర్యటన, ప్రచారం
నవతెలంగాణ-తాడ్వాయి
ఈనెల 21న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తలపెట్టిన ధర్నాను జయప్రదం చేయాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు తుమ్మల వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని వివిధ గ్రామాలలో లింగాల, బంధాల, ఒడ్డుగూడెం, వెంగళపురం, ఊరటం కాలనీ తదితర గ్రామాల్లో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఈనెల 21న ములుగు లో జరుగు ధర్నాను జయప్రదం చేయాలని విస్తత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు పట్టాలిస్తామని, నేటికీ ఇవ్వకుండా జాప్యం చేస్తూ అసెంబ్లీలో జీవో నెంబర్ 140 ప్రకటించిందని అన్నారు. గత ఎనిమిది నెలల క్రితం గ్రామ కమిటీలు వేసి ములుగు జిల్లాలో 31 వేల మంది కి, 90 వేల ఎకరాలకు వ్యక్తిగత దరఖాస్తులు పెట్టుకున్నారని, నేటికీ సర్వే చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ మళ్లీ జీవో జారీ చేసిన అని ప్రకటించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పోడు సాగుదారులకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఆచరణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తాజాగా గ్రామంలో అర్హులైన ప్రజలకు ఇంటి స్థలం ఇచ్చి మూడు లక్షల రూపాయలు ఇస్తానని ప్రభుత్వం ప్రకటించిందని, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు అనుగుణంగా పేద ప్రజలకు ఇంటి నిర్మాణానికి ఐదున్నర లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేస్తున్నదని చెప్పారు. ఐక్యపోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారమౌతాయని స్పష్టం చేశారు. అర్హులైన పేదలు, పోడు సాగుదారులు 21న తలపెట్టిన ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి దుగ్గి చిరంజీవి, గొంది రాజేష్, ఆగబోయిన శంకర్, ఊకే ప్రభాకర్, ఊకే నాగేశ్వరరావు, మల్లక్క, అశోక్ తదితరులు పాల్గొన్నారు.