Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
నవతెలంగాణ-పాలకుర్తి
తెలంగాణలోని గిరిజనులకు రిజర్వేషన్ పెంచాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని, అసెంబ్లీ తీర్మానాన్ని పరిశీలించకుండా కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తూ, గిరిజనులను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తు న్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. సీఎం కేసీఆర్ గిరి జనులకు గిరిజనబంధు, 10శాతం రిజర్వేషన్ అమ లుచేస్తామని ప్రకటించడం పట్ల సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణ కమిటీ నియోజకవర్గ అధ్యక్షులు డాక్టర్ భూక్య రవి రాథోడ్ ఆధ్వర్యంలో పాలకుర్తి నియోజకవర్గంలోని 250 మంది గిరిజన పెద్దలు, ప్రజాప్రతినిధులు మంగళ వారం హైదరా బాద్‌కు తరలివెళ్లి మంత్రి నివాసంలో మంత్రి ఎర్రబెల్లిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రం అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తే ఎలాగని ప్రశ్నించారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ అమలుతో కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చి అసెంబ్లీ తీర్మానం వచ్చిందని ప్రకటించిందని అన్నా రు. గిరిజనులందరూ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్కు అండగా ఉండాలన్నారు. తండాల అభివద్ధిపై దృష్టి పెట్టాలని, సమస్యల పరిష్కారంలో గిరిజన పెద్దలు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. గత పాలకులు గిరిజనుల అభివద్ధి, సంక్షేమాన్ని విస్మరిం చారన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ తాసిల్దార్ లావుడియా పూల్సింగ్నాయక్, సంత్ సేవాలాల్ మహారాజ్ నియోజకవర్గ గౌరవా ధ్యక్షులు మూణావత్ నరసింహ నాయక్, ప్రధాన కార్యదర్శి ధరావత్ రామ్‌సింగ్‌నాయక్, ఉపాధ్యక్షులు ధరావత్ జై సింగ్ నాయక్, గౌరవ సలహాదారు ధారావత్ మోహన్ గాంధీనాయక్, ఆలయ నిర్మాణ కమిటీ నియోజకవర్గ నాయకులు రవినాయక్, సోమనినాయక్, రాములు, శ్రీనునాయక్, మాజీ ఎంపీపీ భూక్య దల్జిత్ కౌర్, సర్పంచులు బాలు నాయక్, కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ దేవానాయక్ పాల్గొన్నారు.
గిరిజనుల ఆరాధ్య దైవం సీఎం కేసీఆర్
తొర్రూరు : గిరిజనుల ఆరాధ్య దైవం ముఖ్య మంత్రి కేసీఆర్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు, గిరి జనబంధు ప్రకటనతోపాటు హైదరాబాద్ బంజార హిల్స్ లో గిరిజనుల కోసం సేవాలాల్ బంజారా భవన్, ఆదివాసీ ల కోసం కొమురం భీమ్ ఆదివాసీ భవన్ ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారం భించిన సందర్బంగా మంగళవారం తొర్రూర్ మండల గిరిజన నాయకులు హైదరాబాద్ బంజార హిల్స్ మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి ఎర్రబెల్లి దయా కర్రావును మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తొర్రూర్ మాజీ సర్పంచ్ ధరావత్ రాజేష్ నాయక్, సేవాలాల్ నిర్మాణ కమిటీ సభ్యులు బానోత్ కిషన్ నాయక్, మాలోత్ కాలు నాయక్,తొర్రూర్ మున్సిపల్ కౌన్సిలర్ గుగులోత్ శంకర్‌నాయక్, ఎంపీటీసీలు జాటోత్ సుజాత రాజేందర్,గుగులోత్ గణేష్, సర్పంచులు హపావత్ సురేష్, జాటోత్ శారద రమేష్, లకావత్ శోభన యాకుబ్,బానోత్ అచ్చమ్మ సోమ్లానాయక్, పీఏసీఎస్ డైరెక్టర్ జాటోత్ టీకు నాయక్, టీఆర్ఎస్ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు జాటోత్ స్వామినాయక్ పాల్గొన్నారు.