Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే తాటికొండరాజయ్య
నవతెలంగాణ-రఘునాథపల్లి
దేశంలో విచ్చిన్నకర పాలన ధోరణిలు పెరుగుతున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు మొగ్గు చూపుతున్నారని, జాతీయ రాజకీయాలకు కేసీఆర్ కావాలని ఆహ్వానిస్తున్నారని, గిరిజన రిజర్వేషన్ పెంపు హర్షణీమని మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. మంగళవారం టీఆర్ఎస్ మండల అధ్యక్షులు వారాల రమేష్ యాదవ్ నాయకత్వంలో పార్టీ కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజనుల రిజర్వేషన్ 10శాతం, గిరిజన బంధు ప్రవేశపెడు తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రైతును రాజు చేయాలనే సంకల్పం తో రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్తు, నాణ్యమైన ఎరువుల సరఫరా తదితర పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీల ఫోరం జనగామ జిల్లా అధ్యక్షులు బొల్లం అజరు మణికంఠ, ప్రధాన కార్యదర్శి మున్సిపట్ల విజరు, మండల సమన్వయకర్త మట్లపల్లి సునీత రాజు, సోషల్ మీడియా ఇన్చార్జి తిప్పారపు రమ్య బాబురావు, ఎస్టీ సెల్ అధ్యక్షులు మూడు తిరుపతి నాయక్, ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.