Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కుంట ఉపేందర్
నవతెలంగాణ-బయ్యారం
రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలం లేని వారికి ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షలు తక్షణమే కేటా యించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కుంట ఉపేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని సైదులు రావు భవనంలో సీఐ టీయూ బయ్యారం మండల 3వ మహాసభ నిర్వ హించారు. ఈ సందర్భంగా ఎన్ మోహన్ సీఐటీ యూ జెండావిష్కరించారు. అనంతరం ఆర్ మల్లి కాంబ, ఎస్కే యాకూబ్ అధ్యక్షతన ఏర్పాటు చేసన సమావేశంలో కుంట ఉపేందర్‌తోపాటు జిల్లా కార్యదర్శి ఆకుల రాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మండా రాజన్న పాల్గొని మాట్లాడారు. ఈ దసర పండుగ నాటికి కేటాయించి సీఎం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటికి వచ్చే అల్లుళ్లు కూతుళ్లుతో పాటు కేసీఆర్ ని కూడా దసరాకు విందు భోజనానికి ఆహ్వానిస్తామని ఎద్దేవ చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కార్మికులకు కనీస వేతనం చట్టం అమలు చేయాలని, మధ్యాహ్న భోజన కార్మికులకు ఇస్తానన్న రూ.2000 ప్రకటించాలని అన్నారు. ఈ నెల 23, 24 తేదీల్లో వంట నిలిపివేసి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. గ్రామ పంచాయతీ కారోబార్ బిల్ కలెక్టర్లు ఈ నెల 23న రాష్ట్ర సదస్సు హైదరాబాదులో జరుగుతుందని తెలిపారు. అనంతరం నూతన కమిటీని 15 మందితో ఎన్నుకున్నారు. మండల కన్వీనర్ గా వల్లాల వెంకన్న, కో కన్వీనర్ గా ఎన్.మోహన్‌తోపాటు కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాయల శ్రీను, బాబూలాల్, సరోజ, లలిత, వెంకన్న, స్వప్న, లతీఫ్, శ్రీను, మంగమ్మ, కరీం తదితరులు పాల్గొన్నారు.