Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట సీపీఐ(ఎం)ధర్నా
నవతెలంగాణ-పాలకుర్తి
ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు వైద్యం అందక పోవడంతో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు చిట్యాల సోమన్న, మండల కార్యదర్శి మాచర్ల సారయ్య ఆరోపిం చారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించి వారు మాట్లా డారు. పాలకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో పేదవానికి వైద్యం అందని ద్రాక్షలా మారిందన్నారు. డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో సమయానికి వైద్యం అందక పాలకుర్తి గ్రామపంచాయతీ కార్మికుడు ట్రాక్టర్ డ్రైవర్ గాదపాక రాములు మతి చెందాడని ఆరోపించారు. పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో పేరుకే వంద పడకల ఆసుపత్రి అని, సరిపడా వైద్యులు లేక పేదలు ఇబ్బందులు పడుతున్నార న్నారు. మంత్రి ఎర్రబెల్లి ఇలాఖలో ప్రజలు మరణి స్తుంటే మంత్రి స్పందింకపోవడం సిగ్గుచేటని అన్నారు. నియోజకవర్గ కేంద్రంలో కనీసం పోస్టు మార్టం గది ఏర్పాటు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వ హాస్పిటల్ లో రెగ్యులర్ వైద్యులను వెంటనే నియమించి ప్రజలకు 24 గంటల వైద్య సేవలు అందించాలన్నారు. గాదపాక రాముల కుటుంబానికి రూ. 20 లక్షల ఎక్స్గ్రేషి యా చెల్లించాలని వారి ఇంటిలో ఒకరికి ఉద్యోగం కల్పించాలన్నారు. నిర్లక్ష్యంగా ఉన్న ఇన్చార్జి డాక్టర్ పై చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే ఉద్యమాలు ఉదతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు సోమ సత్యం, ముస్కు ఇంద్రారెడ్డి, బెల్లి సతీష్, సీఐటీయూ నాయకులు ఏ వెంకన్న, తోటరాజు, కే అశోక్, రామచంద్రు, కుమార్, ఫరీదు, తదితరులు పాల్గొన్నారు.