Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - స్టేషన్ ఘనపూర్
మండల కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ గా మార్చిన పుట్టలమ్మ కుంట చెరువును అన్యాక్రాం తంగా మార్చి, కొందరు అధికార పార్టీకి చెందిన నాయకులు కబ్జాకు పాల్పడుతున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కొలీపాక సతీష్ డిమాండ్ చేశారు. మంగళవారం డివిజన్ కేంద్రంలో ఆర్డీవో కార్యాలయంలో ఏఓ కు వినతి పత్రాన్ని అందించారు. ఈసందర్భంగా సతీష్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీగా కడియం శ్రీహరి వ్యవహరిస్తూ, పుట్టల మ్మ కుంట సర్వే చేయించి హద్దులు నిర్ణయించి, కబ్జాకు పాల్పడిన వారిని అరెస్టు చేయించాలన్నారు. కుంట పరిధి భూమితో అమ్మగా వచ్చిన డబ్బులను ఆసరా చేసుకొని టీఆర్ఎస్కు చెందిన అధికార నాయకులు జరగబోయే, జనరల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు, సమాయత్తమవుతున్నారని ఆరోపిం చారు. నాయకుల ప్రజా వ్యతిరేక విధానాలపై, స్పందించి ప్రజా సంక్షేమానికి ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో బీసీ సెల్ మండల అధ్యక్షులు చల్లా తిరుపతి, యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి, మండల నాయకులు శ్రీనివాస్ భూక్య అరుణ్, రాజేష్ రెడ్డి, బాలరాజు పాల్గొన్నారు.