Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజీపేట
మహిళా సంఘాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తెలిపారు. మడికొండలోని వెంకటేశ్వర గార్డెన్స్‌లో శ్రీ సత్య దేవ, శ్రీ వెంకటేశ్వర, అంబేద్కర్, స్లమ్ మహిళా సమాఖ్య మహిళా పరస్పర సహాయ సహకార పొదుపు, పరపతి సంఘాల 13వ వార్షిక మహాసభ మంగళవారం నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా అభివద్ధి సాధించేందుకు ప్రభుత్వం పాటుపడుతోందని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ రుణాలను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ మహిళా పారిశ్రమిక వేత్తలకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను శాశ్వత కొనుగోలు కేంద్రాలుగా అభివద్ధి చేసి మహిళలతో పంటల కొనుగోళ్లు చేపట్టెందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఆవాల రాధికారెడ్డి, నాయకులు ధువ్వ శ్రీకాంత్, దువ్వా నవీన్, తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మడికొండలో రూ.43 లక్షల వ్యయంతో నిర్మించనున్న డ్రైనేజీ పనులకు టీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ మంగళవారం శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఆవాల రాధికరెడ్డి, డివిజన్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.