Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
బీజేపీ ములుగు నియోజకవర్గ కన్వీనర్‌గా జిల్లా కేంద్రానికి చెందిన సిరికొండ బలరాంను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. బలరాం బాల్యం నుండి స్వయం సేవక్‌గా ఆర్ఎస్ఎస్లో చురుకైన పాత్ర పోషించి అయోధ్య కరసేవలో పాల్గొని విద్యార్థి దశలో ఏబీవీపీ నాయకునిగా పని చేశారు. అనంతరం బీజేపీలో క్రియాశీల కార్యకర్తగా, పట్టణ అధ్యక్షునిగా, జయశంకర్ భూపాలపల్లి ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడిగా, ములుగు జిల్లా బూత్ కమిటీల ఇన్చార్జిగా పని చేశారు. ఈ క్రమంలో ఆయన సేవలను గుర్తించి ఆ బాధ్యతను అప్పగించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బలరామ్ మాట్లాడారు. పార్టీ తనకిచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి పార్టీ అభివద్ధికి కషి చేస్తానని తెలిపారు. అందరినీ కలుపుకొని ములుగు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకుంటామని చెప్పారు. తనకు బాధ్యత అప్పగించడానిఇక కృషి చేసిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌కు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్‌రావుకు, రాష్ట్ర కోశాధికారి బండారి శాంతికుమార్‌కు, జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డికి, జిల్లా ఇన్చార్జ్ ప్రభాకర్‌రెడ్డికి, తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.
బీజేపీ కన్వీనర్ బలరామ్‌కు సత్కారం
బీజేపీ ములుగు అసెంబ్లీ కన్వీనర్‌గా నియమితులైన సిరికొండ బలరామ్‌ను ఆ పార్టీ కార్యాలయ అవరణలో శ్రేణులు మంగళవారం శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా బలరామ్ మాట్లాడారు. తన మీద నమ్మకంతో పార్టీ బాద్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు, నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గాదం కుమార్, కొత్త సురేందర్, యాద సంపత్, రాయంచు నాగరాజు, సిద్ధార్థ, వైద్యుల తిరుపతిరెడ్డి, రవిరెడ్డి, రాజ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.