Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చెన్నారావుపేట
మండలంలోని ఉప్పరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహించారు.186 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా 8 మంది విద్యార్థులకు ఉన్నత వైద్య చికిత్స కోసం ఎంజీఎంకు రిఫర్ చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె ఫ్లోరెన్స్ తెలిపారు. విద్యార్థులు సరైన పౌష్టికాహారాన్ని తీసుకొని, ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగించాలని కోరారు. మెడికల్ అధికారులు రాహుల్,రవళి మాట్లాడుతూ ప్రభుత్వం అందించే ఉచిత వైద్య శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాఠశాల ఉపాధ్యాయులు రమణారావు, శ్రీనివాస్,బాలాజీ రావు, ఉదరు కుమార్, సిహెచ్. మాధవి, మమత రవికుమార్, సుందర్, మురళి రవీందర్, ఏఎన్ఎంలు ఎండి జులేక, మౌనిక, రమ , ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.