Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కవి సౌజన్య డాక్టర్ లింగంపల్లి రామచంద్ర
నవతెలంగాణ-జనగామ
పెట్లోజు వెంకటాచారి సమకాలీన సాహిత్య సజనశీలి అని సౌజన్య డాక్టర్ లింగంపల్లి రామచంద్ర అన్నారు. జనగామ ఎస్ ఆర్ ఆర్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం జనగామ రచయితల సంఘం ఆధ్వర్యంలో దివంగత కవి, గాయకులు పెట్లోజు వెంకటాచారి 4వ వర్ధంతి సభ ఘనంగా నిర్వహించారు. జరసం అధ్యక్షులు అయిలా సోమనర్సింహచారి అధ్యక్షత వహించగా గౌరవ అధ్యక్షులు పెట్లోజు సోమేశ్వరాచారి గురుదేవోభవ పుస్తకాన్ని సమీక్షించారు. ముఖ్యఅతిథిగా సౌజన్య డాక్టర్ లింగంపల్లి రామచంద్ర హాజరై మాట్లాడుతూ... కవి వెంకటాచారి రచనలు సమకాలీన సాహిత్యం అన్నారు. వెంకటాచారి రచించిన గురుదేవోభవ పుస్తకంలోని అంశాలను గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమ ప్రత్యేక అతిధి కల్నన్ డాక్టర్ మాచర్ల బిక్షపతి మాట్లాడుతూ పెట్లోజు వెంకటాచారి సాహి త్యం ప్రజల హదయాల్లో చిరస్థాయిగా నిలబడు తుందని అన్నారు. ప్రజా కళాకారుడు జి కష్ణ రాసిన వెంకటాచారి జీవిత చరిత్ర కరపత్రాన్ని మొదట అతిధులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జరసం ప్రధాన కార్యదర్శి ఆకుల వేణుగోపాలరావు,జి కష్ణ సాంబరాజు యాదగిరి, కొలిపాక బాలయ్య, లగిశెట్టి ప్రభాకర్, పానుగంటి రామమూర్తి, చిలుమోజు సాయి కిరణ్, గజవెల్లి ప్రతాప్, గడ్డం మనోజ్ కుమార్ గౌడ్, మోహన్ కష్ణ భార్గవ, మసురం రాజేంద్రప్రసాద్, గంగరాజు శ్రీనివాసరావు, పొట్టబత్తిని భాస్కర్, డాక్టర్ వేముల సదానందం, రంగరాజు ప్రసాద్, శ్రీరామోజు వెంకటరత్నం, గొలుసుల నర్సయ్య,రవీందర్,జాన్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.