Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
పీసీసీ రాష్ట్ర కమిటీ సభ్యులుగా నియామకమైన కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకుడు రావూరి వెంకట్రామ య్యను శుక్రవారం స్దానిక కాంగ్రెస్ పార్టీ కార్యా లయంలో పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించి అభినందించారు. అనంతరం ఏర్పాటు చేసిన అభినంద సభలో ఆయన మాట్లాడుతూ... కేంద్రంలో మతోన్మాద బీజేపీ, రాష్ట్రంలో నియంతత్వ టీఆర్ఎస్లు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి నియంతృత్వ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఇంటి కోక ఉద్యోగం ఇస్తామని వాగ్దానం చేసిన సీఎం కేసీఆర్ లు ఎంతమంది కి ఉద్యోగాలు, ఉపాధి కల్పిం చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో దేశంలో,రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేం దుకు నాయకులు, కార్యకర్తలు శక్తివంచన లేకుండా కషి చేయాలని కోరారు. తనను రాష్ట్ర కమిటీకి ఎంపిక చేసిన జిల్లా,రాష్ట్ర నాయకులకు కృత జ్ఞతలు తెలిపారు. వర్కింగ్ ప్రెస్ డెంట్ తాళ్లపల్లి కష్ణ,నాయకులు శంషాద్ బేగం, జవహర్ లాల్,డికోండ రాము, నాని,నర్సయ్య ఉన్నారు.