Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసముద్రం మార్కెట్ కమిటీ
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
పసుపు సాగు విస్తీర్ణం పెంపునకు కృషి చేస్తామని కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ మరర్రి నారాయణరావు సభ్యులు తెలిపారు. పసుపు సాగు విస్తీర్ణం పెంపు, ఇతర ప్రాంతాల్లో లభిస్తున్న ధరలు పరిశీలనపై అధ్యయనం చేసేందుకు మార్కెట్ పాలకమండలి సభ్యులు, కార్మిక, కర్షక వ్యాపార ప్రతినిధులతో ఈనెల 20న మహారాష్ట్రలో స్టడీ టూర్ నిర్వహించారు. శుక్రవారం మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్‌ను ప్రతినిధి బృందం సందర్శించింది. పసుపు ప్రాసెసింగ్ యూనిట్లను, పసుపు పంట సాగు, విక్రయాలను పరిశీలించారు. కేసముద్రం మార్కెట్ వైస్ చైర్మన్ బంటు ఉపేందర్, డైరెక్టర్లు మీరా హుస్సేన్, ముదిగిరి కట్టయ్య, దరావత్ రమా రవీందర్, గుజ్జునూరి మణిరత్నం, సంకేపళ్లి జనార్దన్ రెడ్డి, బచ్చు పరమేశ్వర్, కేసముద్రం స్టేషన్ సర్పంచ్ బట్టు శ్రీనివాస్, మార్కెట్ సూపర్వైజర్ రాజేందర్, రైతు సంఘాల ప్రతినిధులు బొబ్బాల యాకుబ్ రెడ్డి, సంకేపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ తోకల శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.