Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బతుకమ్మ చీరలు, చేపలు, పింఛన్లు పంపిణీ
నవతెలంగాణ-గూడూరు
మండలంలో శుక్రవారం మహబూబాబాద్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ విస్తృతంగా పర్యంటించారు. బొద్దుగొండ, దామరవంచ గ్రామాలలో లబ్ధిదారు లకు నూతన అసరా పెన్షన్ కార్డులను అందజేసి ఎమ్మేల్యే మాట్లాడుతూ 50 లక్షల మంది వృద్ధులకు, వితంతువులకు, దివ్యాం గులకు, ఒంటరి మహిళలలకు ఆసరా పెన్షన్లను అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అన్నారు. పెన్షన్లు రానివారు అధైర్య పడొద్దని, వారికి అందించేలా చూస్తామన్నారు. అనంతరం తాసిల్దార్ కార్యాలయంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని చంద్రుని చెరువులో చేప పిల్లలు వదిలారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో ఉచిత చేప పిల్లలను పంపిణీ చేస్తున్మాన్నారు. ఆయా కార్యక్రమాల్లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బీరవెల్లి భరత్ కుమార్ రెడ్డి, జెడ్పీ కోఆప్షన్ ఎండి కాసిం, పీఏసీఎస్ చైర్మన్ చల్ల లింగారెడ్డి, ఎంపీపీ బానోత్ సుజాత మోతిలాల్, వైస్ ఎంపీపీ ఆరే వీరన్న, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు వేం వెంకటకృష్ణారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నూకల సురేందర్, టీఆర్ఎస్ జిల్లా ముఖ్య నాయకులు ముక్క లక్ష్మణరావు, కటార్ సింగ్ , బానోతు రామన్న నాయక్, తాసిల్దార్ ఏం అశోక్ కుమార్, ఎంపీడీవో విజయలక్ష్మి, పలువురు సర్పం చులు ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.