Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్
నవతెలంగాణ-మరిపెడ
తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరలను సీఎం కేసీఆర్్ కానుకగా ఇస్తున్నాడని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ తెలిపారు. శుక్రవారం మరిపెడ మండల ప్రజా పరిషత్ కార్యా లయంలో తహసీల్దార్ పిల్లి రాంప్రసాద్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ గుడిపూడి నవీన్ రావుతో కలిసి ఎమ్మెల్యే హాజరై 26వేలమంది ఆడప డుచులకు చీరలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సంక్షోభంలో చిక్కుకున్న నేతన్నలకు బతుకమ్మ చీరల నేత పని భరోసానిచ్చిందన్నారు. సమైక్య రాష్ట్రంలో ఉపాధి లేక ఆగమైన నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపేందుకు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. ఈ ఏడాది గ్రామల నుంచి వచ్చిన మహిళా ప్రతినిధులు అభిప్రాయాలు, అసక్తులు, నిఫ్ట్ డిజైనర్ల సహకారంతో అత్యుత్తమ ప్రమాణా లతో చీరలు తయారీ చేయించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుగులోత్ అరుణ రాంబాబు, జెడ్పీటీసీ తేజావ్ శారదా రవీందర్, మునిసిపల్ చైరపర్సన్ గుగులోత్ సింధూర రవి, వైస్ ఎంపీపీ గాదె అశోక్ రెడ్డి, ప్రత్యేక అధికారి టి సుధాకర్, ఎంపీడీవో కేలోత్ ధన్సింగ్, ప్రభుత్వ అధికారి రాములు, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, అధికారులు, డీలర్లు పాల్గొన్నారు.