Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డా రాజయ్య
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
సీఎం కేసీఆర్ ఆశీస్సులతో నియోజకవర్గమే ఓ విద్యారంగంగా తయారైందని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. రాష్ట్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలు 15 మంజూరీలో భాగంగా నియోజక వర్గానికి కేటాయించడం పట్ల టీఆర్ఎస్వీ నియోజక వర్గ అధ్యక్షుడు లకావత్ చిరంజీవి, మండల అధ్యక్షుడు బొంకూరి మహేష్, ఆధ్వర్యంలో శుక్రవారం నియోజక వర్గ కేంద్రంలో కేసీఆర్ చిత్రపటా నికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మహిళా పక్షపాతిగా మహిళా డిగ్రీ కళాశాల కావాలని పలుమార్లు అసెంబ్లీలో కోరగా, మంజూరీ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సహకరించిన మంత్రి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి విద్యార్థుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. నియోజక వర్గానికి ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ సీఎంగా ఉన్నపుడు పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటైందని, స్వరాష్ట్ర పాలనలో ఆదర్శ, కస్తూర్బా గాంధీ, మైనార్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లు మంజూరీ చేశారన్నారు. రాష్ట్రంలో 119రెసిడెన్షియల్ పాఠశా లలు మంజూరైనట్లు తెలిపారు. ప్రతీ విద్యార్థికి రూ. లక్షా ఇరవై వెచ్చించి, నాణ్యమైన విద్య, మౌళిక సదు పాయాలు కల్పించిన ఘనత కేసీఆర్ దే అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్ని, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా చేసేందుకు, మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రతి అవకాశాన్ని, విద్యార్థులు సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ స్టాండింగ్ ఛైర్మన్ మారపాక రవి, ఎంపీపీ కందుల రేఖాగట్టయ్య, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు తాటికొండ సురేష్ కుమార్, ఎంపిటిసిలు గన్ను నర్సింహులు, సింగపురం దయాకర్, మునిగెల రాజు, బెల్లపు వెంకటస్వామి, మండల అధ్యక్షుడు మాచర్ల గణేష్, పట్టణ అధ్యక్షుడు మునిగెల రాజు, యూత్ నియోజక వర్గ ఇంచార్జీ మారేపల్లి ప్రసాద్ బాబు పాల్గొన్నారు.