Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సింహులపేట
గిరిజనులు, ఆదివాసీలను ప్రధాని మోడీ అణదొక్కుతు న్నారని, కేసీఆర్ లాంటివారు దేశానికి అవసరమని మహ బూబాబాద్ ఎంపీ మాలోతు కవిత అన్నారు. శుక్రవారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. గోపతండా వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహ దారిపై ఇండియన్ ఆయిల్ కంపెనీ పెట్రోల్ బంక్‌ను డోర్న కల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌తో కలిసి ప్రారంభించారు. పెద్ద నాగారం స్టేజి కళ్యాణ మండపంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నరేంద్ర మోడీ గిరిజలను,ఆదివాసులను తొక్కిపెట్టి రిజర్వేషన్లను అమలు చేయకుండా జాప్యం చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ 40 లక్షల మంది గిరిజనలు ఉన్న రాష్ట్రంలో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ఆమోదం కోసం కేంద్రానికి పంపిస్తే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం రైతుల మోటార్లకు కరెంటు మీటర్లు పెట్టి ఉరితాడు బిగిస్తున్నదని అన్నారు. ఎకరం భూమిలేని గిరిజనులకు గిరిజనబంధు అమలుకు సీఎం కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముస్లింలకు,క్రిస్టియన్లకు, హిందువులకు పండు గల సందర్భంగా నూతన దుస్తులు అందజేస్తున్నారని అన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు 24 రకాల చీరలను అందిస్తున్నారని దీనితో నేతన్నలకు పని కల్పిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ఆశీస్సుల వల్లే భద్రాచలం నుండి మహబూబాబాద్ వరకు పనిచేసే అవకాశం దక్కిందని ఆయనకు రుణపడి ఉంటానని అన్నారు. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ మాట్లాడుతూ నియోజక వర్గంలో లక్షకు పైగా బతుకమ్మ చీరెలు పంపిణీ చేయను న్నట్లు తెలిపారు. ఇప్పటికే 60వేలకు పైగా చీరలు వచ్చి నట్లు తెలిపారు. మిగతావి త్వరలోనే వస్తాయని, 10,500 చీరలు నర్సింహులపేట మండలానికి వచ్చినట్లు తెలిపారు. బీజేపీ వల్లే రైతులకు కరెంటు మీటర్లు వస్తున్నాయని పోరాడటానికి రైతుల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ దేనికైనా సిద్ధమని అన్నారు. ఈ కార్యక్రమంలో డోర్నకల్ యువజన నాయకుడు రవిచంద్ర,జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వర రెడ్డి,జిల్లా కోఆప్షన్ సభ్యులు పాషా, మండల పరిషత్ అధ్యక్షురాలు టేకుల సుశీల యాదగిరి రెడ్డి,వైస్ ఎంపీపీ జాటోత్ దేవేందర్,రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ మధుసూదన్ రెడ్డి, ఓలాద్రి మల్లారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మైదం దేవేందర్, దంతాలపెళ్లి అధ్యక్షుడు ధర్మారపు వేణు, పీఏసీఎస్ చైర్మన్ రాము గౌడ్, వైస్ చైర్మన్ సంజీవరెడ్డి, తహసీల్ధార్ విజరు కుమార్, మండల పంచాయతీ అధికారి సోంలాల్, ప్రత్యేక అధికారి శ్రీనివాస్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మెరుగు శంకర్ గౌడ్, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు సురేష్, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.