Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్
నవతెలంగాణ-వరంగల్
ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ కానుక బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. శుక్రవారం బల్దియా పరిధి 11,29 డివిజన్లలోని లబ్ధిదారులకు 11వ డివిజన్ కీర్తి గార్డెన్లో స్థానిక కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి సురేందర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి నగర మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య, కుడా ఛైర్మెన్ సుందర్ రాజ్ యాదవ్ పాల్గొ న్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హాజరై మాట్లాడారు. ఉద్యమ స్ఫూర్తిని చాటే క్రమంలో పిలుపునిస్తే ఆడపడుచులు బతుకమ్మలు, బోనాలతో ఉద్యమంలో పాల్గొనేవారని, నాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి సంక్షేమాన్ని, అభివద్ధిని సమ పాళ్ళలో ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. ప్రభుత్వ పరంగా రూ. 339 కోట్లతో 24 భిన్న డిజైన్లలో 10 వివిధ రకాల చీరలు తయారు చేసి అందజే స్తున్నారన్నారు. అనంతరం నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించి నిర్వహిస్తు న్నారని అన్నారు. నగర వ్యాప్తంగా బల్దియా తరఫున బతుకమ్మ దసరా పండుగకు పండుగ శోభను తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. జీడబ్ల్యూఎంసీ పరిధిలో మొత్తం 2 లక్షల 26 వేల 16 చీరలు అంది స్తున్న ట్లు తెలిపారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రభుత్వం బతుకమ్మ చీరలను బల్దియా వ్యాప్తంగా ప్రణాళిక బద్దంగా అర్హులకు అందరికి అందించడం జరుగుతుందన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, డిప్యూటీ కమిషనర్ జోనా, రెవిన్యూ అధికారి శ్రీనివాస్, టీఎంసీ రమేష్, తదితరులు పాల్గొన్నారు.
ఆడపడుచులకు కానుకగా బతుకమ్మ చీరలు
నర్సంపేట : తెలంగాణ ఆడపడుచులకు సీఎం కేసీఆర్ కానుకగా బతుకమ్మ చీరలను అందిస్తున్నా డని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని 22వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్ అధ్యక్షతన బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ పట్టణంలో అందుబాటులో వైద్యం అందిం చడానికి ప్రభుత్వం రూ.1.30కోట్లతో బస్తీ దవాఖా నా మంజూరు చేసిందని తెలిపారు. ఇందుకు సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నాగెల్లి వెంకటనారాయణ గౌడ్, వార్డు కౌన్సిలర్ వేముల సాంబయ్య, కౌన్సిలర్లు బానాల ఇందిర, రాయిడి కీర్తి కమిషనర్ నాయిని వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకోవాలి : ఎమ్మెల్యే అరూరి
పర్వతగిరి : రాష్ట్ర ఆడపడుచులు కొత్త చీరలు ధరించి బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. పర్వతగిరి మండలం లోని అనంతారం, గోపనపల్లి, కొంకపాక, చౌటపల్లి, హాట్య తండా గ్రామాలలో శుక్రవారం ఆయా గ్రామాలకు చెందిన 409మంది నూతన పెన్షన్ లబ్ధిదారులకు గుర్తింపు కార్డులు, 3716మంది ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం సుమారు రూ.3కోట్ల 50లక్షలతో చేపట్టిన స్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, పబ్లిక్ టాయిలెట్స్, పల్లె ప్రకతి వనాలు, సీసీ రోడ్లు వంటి అభివద్ధి పనులను ప్రారంభించారు. కొంకపాక గ్రామంలో నూతంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్క రించారు. 240రకాల చీరలను ఆడపడుచులకు అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 12 వేల కోట్ల రూపాయలను పింఛన్ల రూపంలో పంపిణీ చేస్తున్నదన్నారు. ఎంపీపీ కమల, జెడ్పీటీసీ సింగు లాల్,జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మహమ్మద్ సర్వర్, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు, ఆయా గ్రామాల సర్పంచులు దేవేందర్, మహేష్,రమేష్, ఉమ, ఎంపిటిసిలు మోహన్ రావు, లావణ్య, ఎంపీడీఓ చక్రాల సంతోష్ కుమార్ పాల్గొన్నారు.