Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్పిఆర్డీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిట్ల గణేష్
నవతెలంగాణ-జనగామ
వికలాంగుల సాధికారత, సమగ్రాభివృద్ధి కోసం వికలాంగులబంధు పథకం అమలు చేయాలని ఎన్పీఆర్డీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం జనగామ పట్టణంలోని ప్రజాసంఘాల జిల్లా కార్యాలయంలో ఎన్పీఆర్డీ జనగామ జిల్లా విస్తృతస్థాయి సమావేశం సంఘం జిల్లా అధ్యక్షుడు పాముకుంట్ల చందు అధ్యక్షతన నిర్వహించారు. అక్టోబర్ 12వ తేదీన కలెక్టర్ కార్యా లయం ఎదుట నిర్వహించే మహాధర్నా కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బిట్ల గణేష్ మాట్లాడుతూ... బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ కోసం ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ హిందూ నిర్మించి ఇవ్వాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కు వికలాంగుల స్థితిగతులు కనిపిస్తలేవా అని ప్రశ్నించారు. సామాజికాభివృద్ధిలో భాగస్వా మ్యం, సమానఅవకాశాలు కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 20 లక్షల మంది వికలాంగులుంటే వీరిలో కేవలం 4 లక్షల 83 వేల మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తూ అందరికి పెన్షన్లు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటని అన్నారు. 12న ధర్నాను జయప్రదం చేయా లని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎన్పోఆర్డి సంఘం నాయకులు మామిడాల రాజేశ్వరి, బండవరం శ్రీదేవి, ఇట్టబోయిన మధు, తోట సురేందర్, కొత్తపల్లి రమేష్, నాచు అరుణ, పిట్టల కుమార్, బైరగోని మహేష్, మోతె వెంకటమ్మ, మాలోతు రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.