Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య
నవతెలంగాణ-రఘునాథపల్లి
సుమచితగౌరవాన్ని కల్పిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజలు ఎప్పుడు అండగా ఉంటారని గతంలో ఎప్పుడు లేని విధంగా కోట్ల రూపాయలతో 16 రకాల బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన ఘనత కేసీఆర్ కే దక్కిందని మాజీ డిప్యూటీ సీఎం స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. శుక్రవారం రఘు నాథపల్లి మండలం కాంచన పెళ్లి,రఘునాథపల్లి గ్రామాల్లో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధిలో ప్రధమ స్థానంలో నిలిచిందన్నారు. రాబోయే రోజుల్లో గులాబిజెండాను ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివద్ధి చేసి చూపిస్తానని వివరించారు. దేశ ప్రజలు కేసీఆర్ పాలనకు మెగ్గు చెబుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాజెడ్పీటీసీ పోరం అధ్యక్షులు బొల్లం మణికంఠ, అజరు, ఎంపీపీ మేకల వరలక్ష్మి నరేందర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు వారాల రమేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి మున్సిపట్ల విజరు, మండల ఇన్చార్జి మట్లపల్లి సునీత రాజు, జిల్లా సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు పోకల శివకుమార్ గుప్తా, సర్పంచ్లు గావ్వాని విజయ నాగేశ్వరావు, ఎంపీటీసీ సభ్యురాలు రమ్య రాజు, జోసెఫ్, ఎంపీటీసీ సభ్యురాలు రవి ఉష, ఎంపిడిఓ అసీం, నియోజవర్గనేత మేడస్వామి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.