Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆత్మహత్యల నివారణ కమిటీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ పరికిపండ్ల అశోక్
నవతెలంగాణ-తొర్రూరు
జీవితం జీవించడానికే నని, తాత్కాలిక సమస్యలకు నిండు జీవితాన్ని బలి చేయవద్దని ఆత్మహత్యల నివారణ కమిటీ రాష్ట్ర చైర్మన్, సైకాలజిస్ట్‌ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ పరికిపండ్ల అశోక్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక సోషల్ వెల్ఫేర్ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ జయశ్రీ అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. డాక్టర్ అశోక్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత పది సంవత్సరాలుగా ఆత్మహత్యల నివారణకై వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు 28 మందిని ఆత్మహత్య లు చేసుకోకుండా కాపాడగలిగామని తెలిపారు. చిన్న చిన్న సమస్యలకు ఏ ఒక్కరు ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ఎటువంటి సమస్యలు ఉన్న పెద్దల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలన్నారు. అనంతరం ఆత్మహత్యలను నివారించి నిండు జీవితాలలో వెలుగులు నింపుదాం అంటూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి మోహన్ వారణాసి, కళాశాల ఉపాధ్యాయ బందం షీలా బేగం,ఆసియా, తన్వీన్,మమత, విద్యార్థినులు పాల్గొన్నారు.