Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాటారం
మండలంలోని గారేపల్లి (కాటారం) పీఏసీఎస్ సర్వసభ సమావేశం సంఘం అధ్యక్షుడు చల్ల నారాయణరెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ సమ్మయ్య పాల్గొనగా సీఈవో సతీష్ ఎజెండా అంశాలను చదివి వినిపించారు. చైర్మెన్ అధ్యక్షతన పలు అంశాలపై చర్చించారు. అనంతరం చైర్మన్ నారాయణరెడ్డి మాట్లాడారు. పాలకవర్గం సహకారంతో సంఘం అభివద్ధితోపాటు లాభాల బాటలో నడిపిస్తున్నాయని అన్నారు. రైతుల సంక్షేమం కోసం సహకార సంఘాలు పనిచేస్తాయని తెలిపారు. సంఘం ద్వారా రుణాలు పొందిన వారు సకాలంలో చెల్లించి సంఘం అభివద్ధికి కషి చేస్తూ నూతన రుణాలు పొందాలని తెలిపారు. ఆరు నెలలకు ఒకసారి రుణాలు రెన్యువల్ చేసుకోవాలని లేకుంటే అధిక వడ్డీ పడే అవకాశం ఉందని అన్నారు. ఆరు నెలలకు ఒక్కసారి జరిగే సమావేశానికి అందరికీ సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలని సీఈవో సతీష్‌ను కోరారు. ఎంపీపీ సమ్మయ్య మాట్లాడుతూ వాణిజ్య బ్యాంకుల కన్నా తక్కువ వడ్డీకే సహకార సంఘాలు రుణాలు మంజూరు చేస్తున్నాయన్నారు. సహకార సంఘాలు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్న విషయాన్ని గ్రామాలలో అందరికీ తెలిసేలా చర్యలు చేపట్టాలని అన్నారు. సంఘం డైరెక్టర్ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ సంఘం భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి రైతులకు ప్రజలకు అందుబాటులో తీసుకురావాలన్నారు. ఎంపీటీసీ జాడి మహేశ్వరి రమేష్ మాట్లాడుతూకొత్త సభ్యత్వం ఇవ్వాలని సభా దష్టికి తీసుకువచ్చారు. ఎంపీటీసీ రవీందర్రావు మాట్లాడుతూ సహకార సంఘం 1975 సంవత్సరంలో ఏర్పడిందని నేటికి 44 సంవత్సరాలు పూర్తయిందని తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ దబ్బేట స్వామి, ప్రభాకర్‌రెడ్డి, ఎంపీటీసీలు మహేష్, రవీందర్రావు, జాడి మహేశ్వరి, కేడీసీసీబీ సూపర్వైజర్ రాజిరెడ్డి, సర్పంచ్ అంతర్గం రాజమౌళి, డైరెక్టర్లు జక్కుల ఐలయ్య, మారపాక రాజేశ్వరి, ముకులోత్ రాజు నాయక్, ఐత కష్ణవేణి, బాసాని హిమకర్, బండి రమేష్, సీఈఓ ఎడ్ల సతీష్, తదితరులు పాల్గొన్నారు.