Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సురపనేని సాయికుమార్
నవతెలంగాణ-గోవిందరావుపేట
బతుకమ్మ చీరలు కట్టుకొని మహిళలు బతుకమ్మను ఆడాలని టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సురపనేని సాయికుమార్ అన్నారు. మండల కేంద్రంలో సర్పంచ్లావుడియా లక్ష్మి జోగా నాయక్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సాయికుమార్ హాజరై మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ చీరల కోసం ప్రభుత్వం ప్రతి సంవత్సరం 300 కోట్ల రూపాయలను వెచ్చిస్తోందని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి మహిళాభ్యుదయ కార్యక్రమాన్ని నిర్వహించ లేదని చెప్పారు. సీఎం కేసీఆర్ అందించిన ఈ దసరా కానుకను బహుమతిగా స్వీకరించి మహిళలు ధరించి బతుకమ్మలను ఆడి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి లకావత్ నరసింహ నాయక్, ఎంపీటీసీ ఆలూరి శ్రీనివాసరావు. మండల ప్రచార కార్యదర్శి భాస్కర్, పథ్వీరాజ్ ఉట్ల, ఉపసర్పంచ్ హన్మంతరావు, గోవిందరావుపేట గ్రామ కమిటీ అధ్యక్షుడు అక్కినపల్లి రమేష్, సీనియర్ నాయకులు వెంకటేశ్వరరావు, బీసీ సెల్ అధ్యక్షులు నాగచారి, వార్డ్ నెంబర్ తుమ్మల శివ, కార్మిక శాఖ అధ్యక్షులు గట్టు ధర్మయ్య, రామారావు ప్రచార కార్యదర్శి, మహిళలు మహిళ సంఘాలు మండల మహిళ లీడర్ లు టిఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.