Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహాముత్తారం
మంథని నియోజకవర్గంలో గిరిజనులు 40 వేల పైచిలుకు ఓటర్లు ఉండడంతో బీజేపీలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న మండల కేంద్రానికి చెందిన బానోతు జగన్నాయక్ రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సన్నహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన మహాముత్తారం మండలంతోపాటు మంథిని నియోజకవర్గంలోని మేధావులు, గిరిజనులు, నాయకులతో రహస్యంగా సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్లను పలు దఫాలుగా కలిసి ఈసారి నియోజకవర్గంలో ఎమ్మెల్యే టిక్కెటు గిరిజన సామాజిక వర్గానికి కేటాయించాలని కోరినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ తరఫున బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీధర్ బాబుకు టేకట్టు ఇస్తే, అలాగే టీఆర్ఎస్ పార్టీ తరఫున బీసీ సామాజిక వర్గానికి చెందిన పుట్ట మధుకు టికెట్ కేటాయించిన, గిరిజన సామాజిక వర్గానికి చెందిన బానోతు జగన్ నాయక్ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ కేటాయిస్తే గెలిచే అవకాశాలు కనబడుతున్నాయని మేధావి వర్గాలు సూచిస్తున్నారు.