Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి
- నేడు మండల కేంద్రాల్లో ధర్నాలు
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు
నవతెలంగాణ-భూపాలపల్లి
ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు కోరారు. ఈనెల 24న మండల కేంద్రాల్లో తలపెట్టిన ధర్నాలను విజయవంతం చేయాలని ఆయన సూచించారు. జిల్లా కేంద్రంలోని శ్రామిక భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ధరల పెరుగుదలకు కార్పొరేట్ సంస్థల లాభాలు కారణం కాగా నిత్యవసర సరుకులపై జీఎస్టీని విధించిందని గుర్తు చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా అన్ని రకాల ఆహార పదార్థాలపై ఐదు శాతం జీఎస్టీ విధించినట్టు తెలిపారు. బియ్యం, ఉడకబెట్టిన గుడ్లు కూరగాయల ప్యాకింగ్, అల్లం, పసుపు, వస్తువులకు ఐదు శాతం పెంచారు పెంచింది. వంట సామాన్లు గిన్నెలు నూనెలు గ్యాస్ రేట్లను విపరీతంగా పెరిగాయన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 100 నుండి 200 రోజులకు పని దినాలు పెంచాలని, కనీస వేతనం రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రైవేటీకరణ వేగంగా పెంచి నేషనల్ మానిటైషన్ పేరుతో పైపులైన పేరా నీతి అయోగ్ రూ.6 లక్షల కోట్లతో రానున్న నాలుగేండ్లలో మౌలిక వసతులు కల్పిస్తానని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించగా రోడ్లు, రవాణా, హైవేలు, రైల్వేలు, విద్యుత్ శక్తి, పైపులైన్, టెలీ కమ్యూనికేషన్, ఆహార పంపిణీ, మైనింగ్, బొగ్గు, ఇండ్ల నిర్మాణం, పట్టణ అభివద్ధి తదితర మౌలిక వసతులకు పథకం వేసి విస్మరించారని విమర్శించారు. పారిశ్రామిక రంగంలో గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలను నాలుగు కోట్లుగా మార్చి కార్మికులకు ఉన్న హక్కులను కాలరాస్తుందని విమర్శించారు . వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులను శాస్త్రీయంగా నిర్ణయించి దానికి 50 శాతం కలిపి కనీస మద్దతు ధరలు నిర్ణయించాలని, ధరను అమలుపరచడానికి పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టం చేయాలనిరైతుల రుణాలు మొత్తం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మికులకు కనీస వేతనాలు నిర్ణయించాలని, పౌర హక్కులను కాపాడాలని, పౌర హక్కులపై దాడి చేసి రాజ్యాంగాన్ని తమ చెప్పు చేతుల్లోకి తీసుకొని ప్రజలపై నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని, మైనార్టీలు, దళితులు, ఆదివాసీలు, మహిళల హక్కులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, . ఈడీ,సీబీఐ సంస్థలను కక్షపూరితంగా ఉపయోగించడం మానుకోవాలని డిమాండ్ చేశారు. కేరళ ప్రభుత్వ నమూనాను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని, ప్రత్యామాయ విధానాల కోసం ప్రజలంతా పోరాడాలని కోరారు . కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఆ బాధ్యత తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే నిధులను తగ్గిస్తుందని, కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఈడీ, సీబీఐలను ప్రతిపక్ష నాయకులకు వ్యతిరేకంగా వినియోగిస్తున్న చర్యలను మానుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు పెలిశెట్టి రాజయ్య, చిన్న రాజా తదితరులు పాల్గొన్నారు.