Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు మూర్తి
నవతెలంగాణ-భూపాలపల్లి
నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎల్ మూర్తి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య మహిళా డిగ్రీ కళాశాలలో ఆ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నూతన విద్యావిధానంపై శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సుకు జిల్లా అధ్యక్షుడు కడప సంతోష్ అధ్యక్షత వహించగా రాష్ట్ర అధ్యక్షుడు మూర్తి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నూతన జాతీయ విద్యావిధానం ద్వారా విద్యారంగ మొత్తాన్ని ప్రైవేట్, కార్పొరేట్ వ్యక్తులకు అప్పజెప్పే కుట్ర జరుగుతోందని విమర్శించారు. ఒకే భాష, ఒకే మతం వంటి మూఢనమ్మకాలను ప్రేరేపించే విధంగా మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా విద్యార్థులు శాస్త్రీయమైన విద్యా విధానాలను దూరం చేయడం కోసం కూడా లౌకితత్వం లేకుండా ఉన్నటువంటి విద్యా విధానం అన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న స్వతంత్ర పద్ధతిని లేకుండా చేయడం అదేవిధంగా ఉర్దూ మీడియాని విద్యార్థులపై రుద్దడం ఇలాంటివి నూతన విద్యా విధానంలో ఉన్నాయని వారన్నారు. డిగ్రీనీ నాలుగు సంవత్సరాల పాటు పొడిగిస్తూ డబల్ డిగ్రీ టు ఒక విద్యార్థి టైంలో రెండు డిగ్రీలు చేసేటువంటి అవకాశం కల్పిస్తున్నామంటూ యూనివర్సిటీ యొక్క ప్రాధాన్యతను తగ్గించే విధంగా ఉందన్నారు. వెంటనే తెలంగాణ రాష్ట్రంలో నూతన జాతీయ విద్యా విధానం అమలు చెయ్యము అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి దమెర కిరణ్ మాట్లాడుతూ కళాశాల విద్యార్థులకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజ్ రీయింబర్స్మెంట్ విడుదల కాలేదని, హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న విద్యార్థులకు చార్జర్ విడుదల చేయకపోవడం ఇబ్బందిగా ఉందని తెలిపారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజ్ రీయింబర్స్మెంట్, మెస్, కాస్మొటిక్ బిల్లులు విడుదల చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు రాజు, సహాయ కార్యదర్శి సంపత్ రెడ్డి, జిల్లా నాయకులు విష్ణు, సాగర్, అంజి తదితరులు పాల్గొన్నారు.