Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'శ్రీసాయి' ప్రిన్సిపాల్ డాక్టర్ శివకుమార్
నవతెలంగాణ-హసన్‌పర్తి
చదువులో రాణించే విద్యార్థులే దేశానికి ఆదర్శమని శ్రీసాయి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శివకుమార్ అన్నారు. మండలంలోని భీమారం, ఎర్రగట్టుగుట్ట శ్రీసాయి జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ కేదాసి వెంకటేశ్వర కుమార్, కరస్పాండెంట్ ఉప్పుల కుమారస్వామి, డైరెక్టర్ అనుమాండ్ల విద్యాసాగర్, జనగాం రమేష్‌లు జ్యోతి ప్రజ్వళన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. కరోనా వల్ల గత మూడు సంవత్సరాలుగా విద్యా వ్యవస్థ గాడి తప్పిందన్నారు. ప్రతి విద్యార్థి చదువుపై శ్రద్ధ వహించి తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చాలన్నారు. గత పది సంవత్సరాలుగా ఉత్తమ బోధనతో జిల్లా, రాష్ట్ర స్థాయి ర్యాంకులను సాదిస్తుందన్నారు. గత సంవత్సర ఫలితాలలో జిల్లా మొదటి ర్యాంకును సాధించామన్నారు. నిరంతర పర్యవేక్షణ, నాణ్యమైన విద్యాబోధన, ప్రతి విద్యార్థి పై వ్యక్తిగత శ్రద్ధ వల్లనే ఇది సాధ్యమైందన్నారు. ఈ సందర్భంగా జిల్లా ర్యాంకు సాధించిన బూర క్రాంతి కుమార్‌తో పాటు ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. క్రాంతి కుమార్‌కు నగదు పారితోషికం అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకర్షించాయి. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు ఆకుతోట శాంతారాంకర్ణ, వలస జ్ఞానేశ్వర్రావు, పంజాల ప్రభాకర్, మారం నరేందర్, ఆకుతోట రమేష్, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.