Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆటపాటలతో మురిసిన విద్యా ప్రాంగణం
నవతెలంగాణ-హసన్పర్తి
మండలంలోని పెంబర్తి ఏకశిల స్కూల్లో శుక్రవారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు హైందవ సంస్కతిని ప్రతిబింబించే విధంగా రకరకాల వస్త్రధారణలతో రంగురంగుల పూలతో శ్రీదేవి (గౌరీదేవి)ని అలంకరించారు. వందలాది బతుకమ్మలను తీసుకొచ్చి పాఠశాల ఆవరణలో పూజించారు. విద్యార్థినీలు, ఉపాధ్యాయులు సామూహిక ఆట, పాటలతో బతుకమ్మ వేడుకలతో సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏకశిల విద్యా సంస్థల చైర్మెన్డాక్టర్ గౌరు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ మన సంస్కతి, సంప్రదాయాలలో భాగంగా పంచభూతాలతో కూడిన ప్రకతిలో లభ్యమయ్యే అందమైన పువ్వులను పూజించే తెలుగు ప్రజల అతి పెద్ద పండుగ బతుకమ్మ పండుగ అని అన్నారు. జాతీయ స్థాయి గుర్తింపు పొంది తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే బతుకమ్మ, దసరా ఉత్సవాలను ముందస్తుగా ఏకశిల విద్యా సంస్థలలో విద్యార్థులు అత్యంతశోభాయమానంగా జరుపుకోవటం చాలా సంతోషదాయకమన్నారు. మానసిక ఆనందాల్ని పంచే ఇలాంటి వేడుకల్ని జరుపుకోవటం, పండుగల యొక్క ప్రాముఖ్యతని భవిష్యత్తరాలకు అందించటం మన కర్తవ్యమన్నారు. విద్యార్థులంతా భవిష్యత్తులో ఇలాంటి వేడుకల్ని, తెలుగు వారి గొప్పతనాన్ని దేశ వ్యాపితం చేయాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం ఉత్తమ బతుకమ్మల్ని, బతుకమ్మ పాటలు పాడిన వారిని గుర్తించి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఏకశిల విద్యా సంస్థల డైరెక్టర్ గౌరు సువిజారెడ్డి, పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ జి.ఫణిమోహన్రావు, ఉపాధ్యాయులు, పీఈటీలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.