Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
బడుగుల అభివృద్ధే టీఆర్ఎస్ లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేస్తున్నారని ఆయన తెలిపారు. పార్టీ అభివద్ధికి పాటుపడుతూ పదవులు కోరుకోవడం తప్పు కాదని, అవకాశం కోసం ఎదురు చూడాలని ఆయన సూచించారు. శ్రమకు తగ్గ గుర్తింపు ఏదో ఒక రోజు తప్పకుండా వస్తుందని, అందులో భాగంగానే బుర్ర రమేష్ గౌడ్‌కు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి వరించిందని ఎమ్మెల్యే చెప్పారు. జిల్లా కేంద్రంలోని భారత్ ఫంక్షన్ హాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా బుర్ర రమేష్ గౌడ్ శుక్రవారం చేయగా రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, వరంగల్ రూరల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతిలతో కలిసి హాజర య్యారు. తొలుత జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ నుంచి అంబేద్కర్, రాజీవ్ గాంధీ సెంటర్ల మీదుగా డప్పు చప్పుళ్లు డోలు వాయిద్యాలతో భారీ ర్యాలీ నిర్వహించి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వ హించారు. అనంతరం భారత్ ఫంక్షన్ హాల్ లో జరిగిన ప్రమాణ స్వీకా రోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాజకీ యాల్లో పదవిని ఆశించిన వారిలో చాలా మంది ఉంటారని, సముచిత స్థానం కోసం చాలా సమయం పడుతుందని కార్యకర్తలు సమన్వయం పాటించాలని సూచించారు. పదవులు రాని వారు నిరుత్సాహ పడొద్దని రానున్న రోజుల్లో ఉన్నత స్థాయి కల్పిస్తామని భరోసానిచ్చారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రాజకీయాల్లో అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం బంగారు తెలంగాణకు బాటలు వేస్తోందని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలోనే జిల్లా అభివద్ధిలో ముందువరుసలో ఉందని సింగరేణి కార్మికుల నిమిత్తం అదనంగా వెయ్యి క్వార్టర్స్ మంజూరు చేయించామని, ఇంటిగ్రేడ్ మార్కెట్, మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడంతో పాటు వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించడం జరిగిందన్నారు. బీసీ గురుకులానికి నిధులు మంజూరు అయ్యాయని త్వరలోనే పనులు ప్రారంభిస్తామని వివరించారు. జిల్లాలో కూడా అన్ని వర్గాల నాయకులను అవకాశం కల్పిస్తూ ముందుకు సాగుతున్నామనితెలిపారు.గౌడ సామాజిక వర్గానికి జిల్లా స్థాయిలో ఇంతటి అవకాశం కల్పించిన కేసీఆర్ అడుగు జాడల్లో జిల్లా గౌడ సోదరులు కలిసి రావాలని కోరారు. బుర్ర రమేష్ చేపట్టిన పదవికి వన్నె తెచ్చే విదంగా, గ్రంధాలయాల అభివృద్ది పని చేయాలని రానున్న రోజుల్లో పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం బుర్ర రమేష్ గౌడ్ ను పూల బోకే శాలువాతో సత్కరించారు. అనంతరం జిల్లాలోని ఆయా మండలాల నుండి వచ్చిన ప్రజాప్రతినిధులు కార్యకర్తలు బుర్ర రమేష్ గౌడ్‌ను పూల బొకే శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెంకటరాణి సిద్దు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, జెడ్పి వైస్ చైర్మన్ కల్లెపు శోభ రఘుపతిరావు ఎంపీపీ లావణ్య సాగర్‌రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్ధన్, పీఏసీఎస్ చైర్మెన్లు మేకల సంపత్‌కుమార్ యాదవ్, పోరెడ్డి పూర్ణచందర్‌రెడ్డి, జెడ్పీటీసీలు జోరుక సదయ్య, గొర్రె సాగర్, పులి తిరుపతిరెడ్డి, కౌన్సిలర్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.