Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా గవర్నర్ కన్నా లయన్స్ క్లబ్ జనగామ గ్రేటర్ ప్రారంభోత్సవం
నవతెలంగాణ-జనగామ
1917లో వి సర్వ్ నినాదంతో మెల్విన్ జోన్స్ మహనీయునిచే స్థాపించబడిన లయన్స్ ఇంటర్నేషనల్ సంస్థ శత వసంతాలలో విశ్వ వ్యాప్తంగా 200 కు పైగా దేశాలలో విస్తరించిందని 320ఎఫ్ జిల్లా గవర్నర్ కన్నా పరశురాములు తెలిపారు. లయన్స్ క్లబ్ జనగామ మిలీనియం వారిచే నూతనంగా విస్తరించిన జనగామ గ్రేటర్ క్లబ్ ప్రారంభోత్సవంలో జిల్లా గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. మిలీనియం అద్యక్షుడు ఎలికట్టే నరేందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కన్నా మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ల ద్వార చేసే సేవల ద్వారా లభించే సంతప్తి వెలకట్టలేనిదని అన్నారు. చార్టర్ కార్యవర్గ సభ్యులచేత పదవీ ప్రమాణ స్వీకారం చేయించిన ఉపజిల్లా గవర్నర్ ఎన్. వేంకటేశ్వర రావు మాట్లాడుతూ సేవా తత్పరత గల వ్యక్తులు ఉత్తమ పౌరులుగా రానించుటకు లయన్స్ సంస్థ ఉపకరిస్తుందని అన్నారు. చార్టర్ కార్యవర్గం అధ్యక్షునిగా గూడ రాజాబోస్, కార్యదర్శిగా గునిగంటి రామకష్ణ, కోశాధికారిగా వనమోజు శ్రీకాంత్ కార్యవర్గ సభ్యులతో ఉప జిల్లా గవర్నర్ పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన వారి విధులు, బాధ్యతల గురించి వివరించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ వేడుకలో పాల్గొన్న పూర్వ జిల్లా గవర్నర్ ముచ్చ రాజిరెడ్డి, జిల్లా నాయకులు రవీందర్, ప్రభాకర్, చంద్రగిరి ప్రసాద్, కరెముల యాదగిరి, మాధవి, శ్రీరామ్ శ్రీనివాస్, డి. వేంకటేశ్వర్లు, ప్రమోద్‌కుమార్, కష్ణాజీవన్ బజాజ్, కే. రాజశేఖర్ రెడ్డి, జె. రాజేశ్వర్, ఎన్ సుధాకరరెడ్డి, హరికిషన్‌రెడ్డి, పెద్ది వేంకటనారాయణగౌడ్, ఎడమ సంజీవరెడ్డి, గోపయ్య, అశోక్ తదితరులు నూతన కార్యవర్గ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.