Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐటీడీఏ పీఓ అంకిత్
- ముగిసిన జోనల్ క్రీడలు
నవతెలంగాణ-ఏటూరునాగారం టౌన్
క్రీడలు మానసికోల్లాసానికి దోహద పడుతాయని ఐటీడీఏ పీఓ అంకిత్ అన్నారు. మండల కేంద్రంలోని ట్క్రెబల్ వెల్ఫెర్ రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్ క్రీడా మైదానంలో 6 జోన్ల క్రీడలను రెండు రోజులపాటు నిర్వహించారు. శనివారం క్రీడల ముగింపు కార్యక్రమంలో గెలుపొందిన క్రీడాకారులకు షీల్డ్‌లు, మెడల్స్‌ను పీఓ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడలతోపాటు చదువుల్లో రాణించాలన్నారు. పోటీల్లో పాల్గొంటేనే మన ప్రతిభ బయటకు వస్తుందన్నారు. చదువుల్లో కూడా పోటి పడుతూ పోటీ పరీక్షలు, ఉన్నత చదువులకు ముందుకు సాగాలన్నారు. ఉపాద్యాయులు, వ్యాయామ టీచర్లు నేర్పించే మెళకువలను పాటిస్తూ జీవితంలో ఎదగాలన్నారు. తల్లిదండ్రులకు, పుట్టిన ఊరుకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. క్రీడల వల్ల నాయకత్వ లక్షనాలు, క్రమశిక్షణ, స్నేహబావం, సమయ స్పూర్తి, దయగుణం లాంటి లక్షణాలు అలవడుతాయన్నారు. గెలుపొందిన వారు ఆనందపడకుండా ఉండాలని, ఓడినవారు బాధపకుండా ఉండాలన్నారు. ప్రతి క్రీడాకారుడికి ఓటమి గెలుపు తొలిమెట్టు అన్నారు. కార్యక్రమంలో అండర్ 17 కబడ్డీ లో మొదటి బహుమతి వరంగల్ జోన్, ద్వితీయ బహుమతి ఏటూరునాగారం జోన్‌కు వచ్చాయన్నారు. ఖోఖో మొదటి బహుమతి ములుగు జోన్, రెండో బహుమతి ఏటూ రునాగారం, వాలీబాల్ మొదటి బహుమతి వాజేడు, ద్వితీయ బహుమతి కొత్తగూడలకు వచ్చాయన్నారు. టెన్నికాయిట్ కొత్తగూడ మొదటి స్థానంలో నిలవగా, రెండో స్థానంలో ఏటూరునాగారం నిలిచింది. చెస్‌లో ములుగు మొదటి స్థానం, రెండో స్థానం భూపాలపల్లి నిలిచిందన్నారు. క్యారమ్ ఏటూరునాగారం మొదటి స్థానం గెలుచుకోగా, రెండో స్థానం ములుగు చేరిందన్నారు. అలాగే అండర్ 14 కబడ్డీలో మొదటి బహుమతి వరంగల్‌జోన్, రెండో బహుమతి కొత్తగూడకు వచ్చిందన్నారు. ఖోఖో భూపాలపల్లి మొదటి స్థానంలో నిలిచిందని, రెండో స్థానంలో ఏటూరు నాగారం గెలుచుకుందన్నారు. వాలీబాల్ వరంగల్ మొదటి బహుమతి, రెండో బహుమతి ములుగు గెలుచుకుంది. అదేవిధంగా టెన్నికాయిట్ కొత్తగూడెం బహుమతి ములుగు, చెస్ మొదటి స్థానం ములుగు, మహబూబాబాద్, క్యారమ్స్ ఏటూరు నాగారం మొదటి బహుమతి, ములుగు రెండో బహుమతి గెలుచుకుందన్నారు. అనంతరం సంస్కతి కార్యక్రమాలను చేపట్టారు. కార్యక్రమంలో డీడీ పోచం, స్పోర్ట్స్ స్కూల్ ప్రిన్సి పాల్ వెంకటేశ్వరరాజు, ఏటీడీఓ దేశిరాం, జీసీడీఓ సుగుణ, డిప్యూటీ డీఈఓ సారయ్య, పీజీ హెచ్ఎం శ్రీనివాసరావు, స్పోర్ట్స్ ఆఫీసర్లు కిష్టు, శ్యామలత, పీడీలు దేవుల లక్ష్మి, లక్ష్మినారాయణ, పద్మ, సంఘ నాయకులు పొదెం కృష్ణప్రసాద్, చెంచయ్య, జబ్బ రవి, ఎస్ఏలు పాల్గొన్నారు.