Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
జిల్లా కేంద్రంలో రిజిస్ట్రేషన్ పత్రాలు లేని మూడు ఆసుపత్రులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య బృందం నిర్వహించి శనివారం సీజ్ చేశారు. ప్రభుత్వం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు ఆర్సీ నెంబర్ 654 ప్లానింగ్ ఏ 2022-21సెప్టెంబర్ 09, 2022 ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో ఆసుపత్రులపై తనిఖీ లు జరుగుతున్నట్లే, శనివారం జిల్లాలో కూడా డాక్టర్ అల్లం అప్పయ్య ఆధ్వర్యంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ, ఐటిడిఎ డాక్టర్ క్రాంతి కుమార్, ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ వెంకటేశ్వర రావు, డెమో తిరుపతయ్య మానిటరింగ్ ఆఫీసర్స్ దుర్గా రావు, ఒక బందంగా ఏర్పడి జిల్లాలో ఐదు ఆస్పత్రులను తనిఖీ చేశారు. శనివారం మూడు క్లినిక్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2020 ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోకుండా నిర్వహి స్తున్నందున సీజ్ చేసినట్లు తెలిపారు. గణపతి హెల్త్ కేర్ డెంటల్ హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ క్లినిక్, వినరు క్లినిక్, పద్మాక్షి క్లినిక్‌తో పాటు మరో రెండు ఆస్పత్రులను తనిఖీ చేసి వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను పరిశీలిం చారు. ఈ సందర్భంగా డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు ప్రతి ఒక్క ప్రైవేటు క్లినిక్ తప్పనిసరిగా పాటించాలని, ప్రతి ప్రైవేటు క్లినిక్ రిజిస్ట్రేషన్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుండి తీసుకోవాలని అర్హత గలవారు మాత్ర మే రోగులకు వైద్యం అందించాలన్నారు. నిబంధనలు తప్ప కుండా పాటించాలని లేనట్లయితే జరిమానాలకు, శిక్షకు గురవుతారని తెలిపారు. సోమ మంగళ వారాల్లో జిల్లా వ్యాప్తంగా డిప్యూటీ డిఎంహెచ్వోలు ,ప్రోగ్రాం ఆఫీసర్స్ బందాలుగా ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తారన్నారు. రక్త పరీక్ష కేంద్రాలను కూడా తనిఖీ చేసి చట్టానికి విరుద్ధంగా ఉన్నట్లయితే సీజ్ చేస్తామని హెచ్చరించారు.