Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మరిపెడ
పోరాట యోధుడు, బడుగుల జీవితాల్లో వెలుగులు నింపిన సర్వాయి పాపన్న స్ఫూర్తితో ముందుకు సాగాలని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. గురువారం మండలంలోని ఎల్లంపేటలో గౌడ సంఘం సర్పంచ్ రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన సర్ధార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, డోర్నకల్ యువనేత డీఎస్ రవిచంద్రలతో కలిసి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 200ఏళ్లు దాటినా ఒక మనిషిని తలచుకుంటూ ఇప్పటికి ఆయన పట్ల గౌరవాన్ని చూపుతున్నామంటే ఎంత శ్రమించి ఉంటే ఇలా విగ్రహం పెట్టి కొలుస్తామన్నారు. ఊచకోతలకు వ్యతిరేకంగా పోరాడిన సర్వాయి అందరికి మార్గదర్శి అన్నారు. నేటి యువత ఆ మహనీయుడిని ఆదర్శంగా తీసుకుని అంతా ఐక్య మత్యంగా ఉండాలన్నారు. విగ్రహ ఏర్పాటుకు సహకరించిన వారిని అభినందించారు. కార్యక్రమంలో ఎంపీపీ గుగులోత్ అరుణ రాంబాబు, జడ్పీటీసీ తేజావత్ శారదా రవీందర్, యల్లంపేట సర్పంచ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు తాళ్లపెళ్లి శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు తాళ్ల పెల్లి రఘు, తెరాసా జిల్లా నాయకులు రామడుగు అచ్యుత రావు, మాజీ కో ఆప్షన్ మెంబర్ ఆయూ బ్ పాషా, మాజీ ఎంపీపీ గుగులోత్ వెంకన్న, పీఎస్సీఎస్ వైస్ చైర్మెన్ గండి మహేష్, గండి అంబరీష, గండి వెంకటేష్, తాళ్ల పల్లి రాములు, తదితరులు పాల్గొన్నారు.