Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీరామ్మోహన్ రెడ్డి
నవతెలంగాణ-ములుగు
విద్యా హక్కు చట్టంపై విద్యార్థులకు అవగాహన కలిగి ఉండాలని ములుగు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని బ్రిలియంట్ స్కూల్లో న్యాయ విజ్ఞాన సదస్సు శనివారం నిర్వహిం చారు. ఈ సదస్సు కు ములుగు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీరామ్మోహన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులకు విద్యా హక్కుకు చట్టం, మోటార్ వెహికల్ చట్టం తదితర చట్టాల గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు బాలుగా చంద్రయ్య, న్యాయవాదులు మేకల మహేందర్, కోర్టు సిబ్బంది రవి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.