Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎంహెచ్ఓ నిర్లక్ష్యంపై విచారణ చేపట్టాలి
- డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆత్కూరి శ్రీకాంత్
నవతెలంగాణ-భూపాలపల్లి
జిల్లాలో అనుమతులు లేని ఆసుపత్రులను మూసివేయాలని జిల్లా వైద్యాధికారిపై విచారణ జరిపి సస్పెండ్ చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆతుకూరి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని శ్రామిక భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న ఆసుపత్రులలో కేవలం 11 ఆస్పత్రులకు మాత్రమే అనుమతులు ఉండగా నిబంధనలకు విరుద్దంగా ప్రయివేట్ ఆస్పత్రులు పుట్టగొడుగుల్ల పుట్టుకొస్తూ ధనార్జనే ధ్యేయంగా నడుస్తున్నాయని ఆరోపించారు. ఇంత జరుగుతున్న జిల్లా వైద్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, గతంలో ఎన్నొ సార్లు కలెక్టర్ కి అడిషనల్ కలెక్టర్ కి వైద్యాదికారి ధనసరి శ్రీరామ్ కి పలుమార్లు పిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఎంక్వయిరీ చేస్తున్నమంటూ సాకులు చెప్పి నిర్లక్ష్యం వ్యవహరిస్తూ కనీసం సమాచారం ఇవ్వకుండా వారికి వారే తనికిలు చేసి అనుమతులు లేని హస్పిటల్స్ అనుమతులకోసం అప్పీల్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా అనుమతులు లేని ఆస్పత్రులను మూసి వేసి ప్రజలకు న్యాయం చేయాలని లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమాలను ఉదతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో స్వామి, మణికంఠ, అజయ్, తదితరులు పాల్గొన్నారు.