Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
- బతుకమ్మ చీరలు, ఆసరా పెన్షన్ కార్డులు పంపిణీ
నవతెలంగాణ-రేగొండ
పేద మహిలలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. మండలంలోని పెద్దంపల్లి, రేగొండ, తిరుమలగిరి, నారాయణపూర్, కొత్తపల్లి బి, జూబ్లీ నగర్, రామన్నగూడెం తండా, బాగిర్తి పేట, దుంపిల్లపల్లి, గూడేపల్లి, కోటంచ, మడతపల్లి, పొనగల్లు గ్రామాల్లో మహిళలకు శనివారం ఆయన బతుకమ్మ చీరలు, లబ్దిదారులకు ఆసరా పెన్షన్ కార్డులను ఎమ్మెల్యే పంపిణీ చేసి మాట్లాడారు. పేదలకు పెన్షన్లు ఇచ్చి ఆదుకుంటున్న ఘనత కేసిఆర్ దేనాని గుర్తు చేశారు. రైతులకు రైతుబంధు, రైతు బీమా వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతూ వ్యవసాయాన్ని అభివద్ధి చేస్తున్నాడని అన్నారు. గ్రామాల్లో డంపింగ్ యార్డులు, పాఠశాల భవనాలు, స్మశాన వాటికలు, సిసి రోడ్లు నిర్మిస్తూ గ్రామాల అభివద్ధికి తోడ్పడుతున్నామని అన్నారు. ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని, సంస్కతిని చాటుతున్న ఏకైక ప్రభుత్వమని చెప్పారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివద్ధి చేస్తున్నానని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పున్నం లక్ష్మి రవి, రైతుబంధు జిల్లా కోఆర్డినేటర్ ఇంగే మహేందర్, ఎంపీటీసీల ఫోరమ్ జిల్లా అధ్యక్షుడు ఎర్రబెల్లి రవీందర్రావు, పిఎసిఎస్ చైర్మన్ నడిపెల్లి విజన్ రావు, జడ్పీ కోఆప్షన్ సభ్యులు రహీం, వైస్ ఎంపీపీ కుందూరు ఉమా విద్యసాగర్రెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు అంకం రాజేందర్, తాసిల్దార్ షరీఫ్ ఉద్దీన్, ఎంపీడీవో సురేందర్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ సామల పాపిరెడ్డి, కొడవటంచ ఆలయ చైర్మన్ మాదాడి అనిత కరుణాకర్ రెడ్డి, బుగులోని జాతర చైర్మన్ కడారి జనార్ధన్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు దాసరి నారాయణరెడ్డి, సర్పంచులు పసుల ప్రియాంక రత్నాకర్, ఏడునూతుల నిశీధర్ రెడ్డి, కట్ల రాణి మధుసూదన్ రెడ్డి, గైకోటి సునీత రవి, అడప స్వర్ణలత సుధాకర్, జంగిటి నరేష్, బానోతు బిక్యా నాయక్, బొక్క భాస్కర్, మెరుగు విజయ్ కుమార్, లింగంపల్లి ప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు.