Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
ఈనెల 28న జిల్లా కేంద్రంలో కేజీకేఎస్ జిల్లా మహాసభ నిర్వహిస్తామని జిల్లా ప్రధాన కార్యదర్శి బాల్నే వెంకట మల్లయ్య తెలిపారు. స్థానిక కామాక్షి ఫంక్షన్ హాల్లో గర్వందుల వేణు అధ్యక్షతన శనివారం నిర్వహించిన మండల కమిటీ సర్వసభ్య సమావేశంలో మల్లయ్య మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గీత కార్మికులకు ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని, టాడీ కార్పొరేషన్‌కు కేటాయించిన బడ్జెట్ విడుదల చేయాలని, గీత కార్మికుల కోసం గీతబంధు తీసుకొచ్చి రూ.10 లక్షలు చొప్పున సాయం అందించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా కమిటీ సభ్యులు భీమగాని శ్రీధర్, కుర్రాముల పరశురాములు, జిల్లా నాయకులు తాళ్లపల్లి భాస్కర్, తాళ్లపల్లి అంజయ్య, మండల ప్రధాన కార్యదర్శి నామాల శ్రీనివాస్ మాట్లాడుతూ మండల, జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరారు.
మండల కమిటీ ఎన్నిక
అనంతరం కేజీకేఎస్ మండల కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడుగా తాళ్లపల్లి అంజయ్య, అధ్యక్షుడుగా దూడల నాగయ్య, ప్రధాన కార్యదర్శిగా మార్క ఉపేందర్, కార్యదర్శిగా భీమగోని శ్రీధర్, ఉపాధ్యక్షులుగా బాల్నే రవి, నామాల భాస్కర్, బొంగోని కరుణాకర్, బైరు ఉప్పలయ్య, బత్తిని భాస్కర్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో నాయకులు కుర్రముల పరశురాములు, బుర్ర ఆంజనేయులు, బాల్నె శ్రీనివాస్, అంబాల శ్రీనివాస్, బాల్నె సిద్దయ్య, రాగుల రాజయ్య, చీకట్ల శ్రీనివాస్, తాళ్లపల్లి సిద్ధిరాములు, తాళ్లపల్లి బుచ్చిరాములు, బాల్నె రమేష్, బైరగోని రాజు, మారగొని శ్రీనివాస్, సహాయక కార్యదర్శి దూసరి సతీష్, బత్తిని వేణు, నామాల ఉప్పలయ్య, బైరగోని శ్రీహరి, బాల్నె మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.