Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు
నవతెలంగాణ-భూపాలపల్లి
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వీడాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు కోరారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ కార్యాలయ ఏవో మహేష్ బాబుకు శనివారం అందించారు. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ధరల పెరుగుదలకు కార్పొరేట్ సంస్థల లాభాలు ఒక కారణం కాగా కేంద్ర ప్రభుత్వం ఈమధ్య నిత్యవసర సరుకులపై జిఎస్టి విధించిందన్నారు. ఆహార పదార్థాలపై ప్యాకింగ్ పేరుతో ఐదు శాతం 12 శాతం, 15 శాతం జీఎస్టీ విధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. వంట సామాన్లు, గిన్నెలు, నూనెలు గ్యాస్ రేట్లను విపరీతంగా పెంచిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. నిరుద్యోగం 8.3 శాతం పెరిగిందని ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మాటలు నీటి మూటలుగా మారాయని ఆరోపించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 100 నుండి 200 రోజులకు పని దినాలు పెంచాలని, కనీస వేతనం రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని కోరినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పారిశ్రామిక రంగంలో గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలను నాలుగు కోట్లుగా మార్చి కార్మికులకు ఉన్న హక్కులను కాలరాస్తుంది. కనీస మద్దతు ధరలు నిర్ణయం లేదు డాక్టర్ సామినాదన్ సిఫారసుల మేరకు వ్యవసాయ ఉత్పత్తులకు ఉత్పత్తి ఖర్చుపై 50 శాతం అదనంగా ధర నిర్ణయించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులను శాస్త్రీయంగా నిర్ణయించి దానికి 50 శాతం కలిపి కనీస మద్దతు ధరలు నిర్ణయించాలని,ఈ ధరను అమలుపరచడానికి పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టం చేసి .రైతుల రుణాలు మొత్తం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు రాజయ్య, రజాక్, తదితరులు పాల్గొన్నారు.