Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బతుకమ్మ, దసరా ఉత్సవాలు అంబరాన్ని అంటాలి
- రాష్ట్ర పీఆర్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
నవతెలంగాణ-పాలకుర్తి
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మహిళలకు ఆయన బతుకమ్మ చీరలు, లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులను శనివారం పంపిణీ చేశారు. అనంతరం ఎంపీపీ నల్ల నాగిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. గత పాలకులు బతుకమ్మ పండుగను విస్మరించారని తెలిపారు. స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత బతుకమ్మ పండుగకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, తెలంగాణ బతుకమ్మ దేశానికే ఆదర్శంగా ఉందన్నారు. చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రూ.330 కోట్లు బతుకమ్మ చీరలకు ఖర్చు చేశామని తెలిపారు. పెన్షన్ల అమలులో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి ఇద్దరు నాయకులే ప్రముఖులని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పెన్షన్లతోపాటు రూ.2లకే కిలో బియ్యం ఇచ్చారని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో సీఎం కేసీఆర్ తెలంగాణలో పాలన సాగిస్తూ వద్ధులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు, వికలాంగులకు 2016 నుండి 316లు పెన్షన్ అందిస్తున్నారని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల దుష్ప్రచారాన్ని కార్యకర్తలు తిప్పి కొట్టాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్డీఏ పీడీ గూడూరు రాంరెడ్డి, ఏపీడీ నూరొద్దీన్, జెడ్పీటీసీ శ్రీనివాసరావు, జిల్లా కోఆప్షన్ సభ్యుడు మదార్, తహసీల్దార్ భూక్య పాల్‌సింగ్ నాయక్, ఎంపీడీఓ వనపర్తి అశోక్‌కుమార్, జిల్లా సమైక్య అధ్యక్షురాలు గిరగాని సుధ, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ వీరమనేని యాకాంతరావు, పాలకుర్తి, తొర్రూర్ సొసైటీల చైర్మెన్లు బొబ్బల అశోక్‌రెడ్డి, గోనె మైసిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుగులోతు పార్వతి దేవానాయక్, ఎంపీటీసీల ఫోరమ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు మాటూరి యాకయ్య, ఏపీఎం రాచకొండ రమణాచారి, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఐకేపీ సిబ్బంది, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.
కొడకండ్ల : మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జ్యోతి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మహిళలకు మంత్రి దయాకర్‌రావు బతుకమ్మ చీరలు పంపిణీ చేసి మాట్లాడారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మెన్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఈజీఎస్ స్టేట్ డైరెక్టర్ యాకయ్య, మార్కెట్ కమిటీ చైర్మెన్ సంపెట రాము, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ వెంకటేశ్వర్రావు, పార్టీ మండల అధ్యక్షుడు రామోజీ, సర్పంచ్ మధుసూదన్, ఎంపీటీసీ విజయలక్ష్మి, అదనపు కలెక్టర్ అమిత్, తదితరులు పాల్గొన్నారు.
దేవరుప్పుల : మండల కేంద్రంలోని అక్షర గార్డెన్స్‌లో మహిళలకు మంత్రి దయాకర్‌రావు బతుకమ్మ చీరలు పంపిణీ చేసి మాట్లాడారు. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని, స్వరాష్ట్రంలో ఆడపడుచులకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత సంతరించుకుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ బస్వ సావిత్రి, జెడ్పీటీసీ పల్ల భార్గవి తదితరులు పాల్గొన్నారు.
బచ్చన్నపేట : మండల పరిషత్ కార్యాలయంలో మహిళలకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బతుకమ్మ చీరలు పంపిణీ చేసి మాట్లాడారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ గిరబోయిన భాగ్యలక్ష్మి అంజయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, ఎంపీపీ భావనల నాగజ్యోతి కష్ణంరాజు, సర్పంచ్‌లు వడ్డేపల్లి మల్లారెడ్డి, పర్వతం మధు ప్రసాద్, కోఆప్షన్ సభ్యుడు షబ్బీర్, తదితరులు పాల్గొన్నారు.
స్టేషన్ఘనపూర్ : తెలంగాణా సంస్కతికి అద్దంపట్టే బతుకమ్మ తెలంగాణ ప్రజాఉద్యమంలో భాగమైందని మాజీ డిప్యూటీ సీఎం, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య తెలిపారు. చిల్పూర్ మండలంలోని మల్కాపూర్, క్రిష్ణాజిగూడెం గ్రామాల్లో జెడ్పీ చైర్మెన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డితో కలిసి మహిళలకు బతుకమ్మ చీరలు, లబ్దిదారులకు ఆసరా పింఛన్ల కార్డులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లు కొంగరి రవి, అంజనీదేవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మెన్ మాట్లాడారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మెన్ ఎడవెళ్లి క్రిష్ణారెడ్డి, ఎంపీపీ బొమ్మిశెట్టి సరిత బాలరాజు, మండల సమన్వయకర్త పోలేపల్లి రంజిత్‌రెడ్డి, ఎంపీటీసీ సాదం నర్సింహులు, మునిపల్లి సుధాకర్, పీఏసీఎస్ వైస్ చైర్మెన్ చిర్ర నాగరాజు, డైరెక్టర్లు కలకోల పోచయ్య, రాజన్ బాబు, రంగు రమేష్, హరీష్, మండల అధ్యక్షుడు రమేష్‌నాయక్, నాయకులు గుర్రపు వెంకన్న, మారబోయిన ఎల్లయ్య, కెంగర్ల మల్లేష్, మోతె శ్రీను, రవి, వెంకట స్వామి, తదితరులు పాల్గొన్నారు.
కాజీపేట : 62వ డివిజన్ పరిధిలోని సోమిడి కమ్యూనిటీ హాలులో మహిళలకు కార్పొరేటర్ జక్కుల రమ రవీందర్ యాదవ్ బతుకమ్మ చీరలు పంపిణీ చేసి మాట్లాడారు. కార్యక్రమంలో సీఓ శ్రీనివాస్, డీఎల్ఎఫ్ అధ్యక్షురాలు హరిత, ఆర్పీలు నాగలత, దివ్య, రమ, సాంబలక్ష్మి, భాగ్యలత, శ్రీదేవి, ఓబీలు తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూర్ : మండలంలోని నీరుకుళ్లలో మహిళలకు సర్పంచ్ అర్షం బలరామ్, ఎంపీటీసీల ఫోరమ్ మండల అధ్యక్షష్ట్రడు వరుణ్ గాంధీ చీరలు పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సంస్కతి, సాంప్రదాయాలను ప్రోత్సహిస్తూ మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోందన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.
నడికూడ : మండలంలోని పులిగిల్లలో సర్పంచ్ పాలకుర్తి సదానందం గౌడ్ చేతుల మీదుగా మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.