Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి
నవతెలంగాణ-భూపాలపల్లి
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అన్నారు. శనివారం భూపాలపల్లి పట్టణం సుభాష్ కాలనీలోని కూరగాయల మర్కెట్ మైదానంలో స్త్రీ శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించారు. మహిళలు, అంగన్వాడీ టీచర్లు, యువతులు పాల్గొనగా వారితో కలిసి గండ్ర జ్యోతి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్ కానుకగా ప్రతీ బతుకమ్మ పండుగగా చీరెలను అందిస్తున్నారని తెలిపారు. పేదల కండ్లలో పండగ పూట దుఖం ఉండొద్దనే భావనతో సీఎం కేసీఆర్ మహిళలకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జీ డీడబ్ల్యూఓ, సీపీఓ సామ్యూల్, జెడ్పీ వైస్ చైర్పర్సన్ కళ్లెపు శోభ, మునిసిపల్ చైర్పర్సన్ వెంకటరాణి, ఎంపీపీ మండల లావణ్య, సఖి అడ్మినిస్ట్రేటర్ గాయత్రి, తదితరులు పాల్గొన్నారు.
మహదేవపూర్ : ప్రభుత్వ పాఠశాలలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బొడ్డెమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ రాధిక, జిల్లా మహిళా అధికారి కళ్యాణి, సఖి సెంటర్ అధికారి సరిత, ఐసీడీఎస్ యూనిట్ అధికారులు వెంకటస్వామి, రాజ కొమురయ్య, పోషన్ అభియాన్ అధికారులు ప్రవీణ్, సప్న, ఎంపీపీ రాణిబాయి, సర్పంచ్ శ్రీపతి బాపు, ఎంపీడీఓ శంకర్‌నాయక్, తహసీల్దార్ శ్రీనివాస్, జెడ్పీటీసీ గుడాల అరుణ శ్రీనివాస్, ఐసీడీఎస్ పరిధిలోని 5 మండలాల అంగన్వాడి టీచర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగ సూరారంలోని ఎస్‌ఎస్‌వీఎం స్కూల్లో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు పలు రకాల పూలు తీసుకొచ్చి బతుకమ్మను పేర్చి ఆడిపాడారు. కార్యక్రమంలో కరెస్పాండెంట్ సుభాష్ చంద్రబోస్ టీచర్లు పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు.
ఎంజీఎం పాఠశాలలో..
గణపురం : మండలంలోని చెల్పూర్లోని ఎంజీఎం హైస్కూల్లో బతుకమ్మ వేడుక నిర్వహించారు. విద్యార్థినులు, ఉపాధ్యాయులు బతుకమ్మ ఆట ఆడి పాడారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ గ్యాదంగి సతీష్ మాట్లాడారు. ప్రకతితో ముడిపడిన పండుగగా అభివర్ణించారు. పువ్వులనే దేవుడుగా కొలవడం, బతుకుల్లోని కష్టాలనే పాటలుగా పాడడం తెలంగాణ ప్రజలకు మాత్రమే చెల్లిందనారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు గ్యాదంగి రమాదేవి, సిలివేరు శ్రీనివాస్, గుండెబోయిన రమాదేవి, ప్రిన్సిపాల్ మధుకర్, ఉపాధ్యాయినులు మణి, శిరీష, సుమలత, లక్ష్మి, వాణి, లత, తదితరులు పాల్గొన్నారు.
కాటారం : మండల కేంద్రంలోని ఆదర్శ హైస్కూల్లో నిర్వహించిన ముందస్తు బతుకమ్మ సంబరాలు అలరించాయి.. విద్యార్థినులు, ఉపాధ్యాయులు రంగురంగుల పూలతో రూపొందించిన బతుకమ్మలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆదర్శ విద్యాసంస్థల చైర్మెన్ జనగామ కరుణాకర్‌రావు, కరస్పాండెంట్ కార్తీక్‌రావు, ప్రిన్సిపల్ కషిత, తదితరులు పాల్గొన్నారు.
చిట్యాల : నవాబ్‌పేటలో పాఠశాలలో సర్పంచ్ సాయిసుధా రత్నాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుసునపు కిరణ్‌కుమార్, దొడ్డ ఆదర్శ్, అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి, శారద, పర్లపల్లి పద్మ, తదితరులు పాల్గొన్నారు.
మల్హర్రావు : మండలంలోని పెద్దతూండ్ల గ్రామంలోని బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్లో ముందస్తుగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. రంగు రంగుల పూలతో చిన్నారులు బతుకమ్మలను పేర్చి కోలాటాలు వేస్తూ అట పాటలతో సందడి చేశారని ప్రిన్సిపాల్ వాలా శశిధర్రావు తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది స్వప్న, తులసి, లావణ్య, సంధ్యారాణి, రాజమణి, శ్రీలత, అస్మా, విద్యార్థులు పాల్గొన్నారు.
మాస్టర్జీ డిగ్రీ కళాశాలలో..
హన్మకొండ : హంటర్‌రోడ్డులోని మాస్టర్జీ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ కళాశాల డైరెక్టర్ సంగంరెడ్డి అచ్చుత్ రాజ్ యాదవ్ మాట్లాడారు. కార్యక్రమంలో అధ్యాపకులు అనురాధ, కవిత, సాహిత్య, స్రవంతి, దివ్య, శ్రీలత, రోజా, కీర్తన మాల, సబిత, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.
శ్రీనివాస్ గురుకుల్ స్కూల్లో..
హన్మకొండ : బాలసముద్రంలోని శ్రీనివాస్ గురుకుల్ స్కూల్లో విద్యార్థులు బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు. వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి వాటి చుట్టూ బతుకమ్మ పాటలు పాడుతూ విద్యార్థులు సంతోషంగా గడిపారు. నిత్యం పుస్తకాల్లో మునిగిపోయే విద్యార్థులు వారి ఆటపాటలతో తోటి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయే విధంగా నత్యం చేశారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ చిదురాల సోమరత్నం, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
హన్మకొండ చౌరస్తా : న్యూ లయోలా హైస్కూల్లో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థులు బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ తాడిశెట్టి సుప్రజ మాట్లాడారు. బతుకమ్మ విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో సౌజన్య, సునీత, నాగలక్ష్మి, మాధవి, అమ్రిన్, గౌసియా, స్వప్న, గాయత్రి, శిరీష, తదితరులు పాల్గొన్నారు.
సుబేదారి : సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బతుకమ్మ సంబరాలను అధ్యాపకులు, విద్యార్థులు నిర్వమించారు. ప్రిన్సిపాల్ ఆచార్య బన్న ఐలయ్య బతుకమ్మ ఆడి ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ ప్రజల అత్యంత ముఖ్యమైన పండుగగా అభివర్ణించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఆచార్య హనుమంతు, సహాయక రిజిస్టర్ కిష్టయ్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
వేలేరు : మండలంలోని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల్లో బతుకమ్మ పండుగ నిర్వహించారు. విద్యార్థులు బతుకమ్మలు పేర్చి ఉత్సహంగా ఆడిపాడారు. జెడ్పిహెచెస్ వేలేరు, ఎర్రబెల్లి ఎంపిపిఎస్ వేలేరుతోపాటు 14 గ్రామాలలోని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల్లో విద్యార్థులు తెలంగాణా సంస్కతి సంబరాలు ఉట్టిపడేలా కట్టు బొట్టులతో చూపరులను అలరించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నాగకుమారి, మాధవి, లీలాబాయి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నడికూడ : మండలంలోని నర్సక్కపల్లె అంబేద్కర్ కాలనీలోని అంగన్వాడి కేంద్రం 2వ సెంటర్లో బతుకమ్మ పండుగ సంబరాలు నిర్వహించారు. బంతి పూల బతుకమ్మ, పోషకాహారం తెలియజేసేలా, పిల్లలకు కూరగాయల వేషధారణతో అలంకరించి ఆట పాటలతో బతుకమ్మ సంబరాలు జరిపారు. అనంతరం అంగన్వాడీ టీచర్ కొడెపాక సుప్రియ మాట్లాడారు. గర్భిణులకు, కిషోర్ బాలికలకు, చిన్న పిల్లలకు అంగన్వాడి కేంద్రంలో పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. గర్భిణీలకు, బాలింతలకు, ఆరేండ్లలోపు పిల్లలకు ఎత్తు, బరువు పరిశీలించి తగిన సూచనలు చేస్తామని తెలిపారు.
శాయంపేట : మండలంలోని ప్రగతిసింగారంలోని సన్‌రైజ్ పాఠశాలలో బతుకమ్మ వేడుకలను నిర్వమించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పెంట తిరుపతి మాట్లాడారు. సంస్కతి సంప్రదాయాలకు ప్రతిరూపకంగా బతుకమ్మ పర్వదినం జరుపుకోవడం అభినందించదగ్గ విషయమన్నారు. విద్యార్థులు చదువులతోపాటు సాంస్కతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వీణ, జ్యోతి, రచన, గీత, శ్రీధర్, సాయిరెడ్డి, కిరణ్, విద్యార్థులు పాల్గొన్నారు.
దామెర : మండల కేంద్రంలోని ఏకశిలా ప్రైమ్ స్కూల్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. విద్యార్థినులు, ఉపాధ్యాయులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి దుర్గామాతను పూజించారు. కోలాటం ప్రదర్శనతో బతుకమ్మ పాటలతో ఆడిపాడారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ దినేష్‌రెడ్డి మాట్లాడారు. బతుకమ్మ విశిష్టతను వివరించారు. అనంతరం వైస్ ప్రిన్సిపాల్ మణికుమార్ మాట్లాడుతూ పాఠశాలలో సంస్కతి, సంప్రదాయాలను భావితరాలకు అందించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
సంస్కృతికి బతుకమ్మ ప్రతీక : డీడబ్ల్యూఓ జయంతి
జనగామ కలెక్టరేట్ : బతుకమ్మ పండుగను సంస్కృతికి ప్రతీకగా జిల్లా సంక్షేమ అధికారి జయంతి అభివర్ణించారు. జిల్లా కేంద్రంలోని ఎన్ఎంఆర్ గార్డెన్లో బొడ్డెమ్మ వేడుకలను ఆమె శనివారం జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. కూచిపూడి నృత్యం, బతుకమ్మ పాటలు, కోలాట ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. అనంతరం జయంతి మాట్లాడారు. ఆడపిల్లలు సహనంతో, ఓపికతో, క్రమశిక్షణతో నేర్చుకోవాలని కోరారు. మానసికంగా, శారీరకంగా ఎదిగినప్పుడే ఆడపిల్లలకు సమాజంలో గౌరవం పెరుగుతుందని తెలిపారు. బాల్య వివాహాలు తగదన్నారు. సఖి సెంటర్ ప్రతినిధి రేణుక మాట్లాడుతూ మహిళలకు అండగా ఉంటామన్నారు. డాక్టర్ కల్పనా దేవి మాట్లాడుతూ మొక్కలను పెంచిన రీతిలోనే పిల్లలను ఆరోగ్యవంతంగా పెంచాలన్నారు. ఎక్సైజ్ శాఖ జిల్లా సూపరింటెండెంట్ కృష్ణప్రియ మాట్లాడుతూ ఆడపిల్లలకు చదువుతోపాటు ఆరోగ్యం ముఖ్యమన్నారు. తరిగొప్పుల జెడ్పీటీసీ, హెల్ప్‌లైన్ అధికారి పద్మలత మాట్లాడారు. తొలుత కళాకారులు గీతాలతో అలరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్, ఉద్యాన శాఖ అధికారి లత, ఇంటర్మీడియట్ అధికారి శ్రీనివాసులు, పరిశ్రమల అధికారి రమేష్, డీపీఆర్వో శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
శ్రీ అరబిందో పాఠశాలలో..
జనగామ : పట్టణంలోని శ్రీ అరబిందో పాఠశాలలో బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి బతుకమ్మలు ఆడిపాడారు. కార్యక్రమంలో కరెస్పాండ్ంట్, ప్రిన్సిపాల్ పాల్గొని విద్యార్థినులను, ఉపాధ్యాయు లను అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వాసుదేవరెడ్డి, రాజరెడ్డి, సరిత, పద్మావతి, కిరణ్మయి, రమ్య, విద్యార్థినులు పాల్గొన్నారు.
లింగాలఘనపురం : మండలంలోని వనపర్తి పీవీఆర్ హైస్కూల్లో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్పర్సన్ శ్రీలతరెడ్డి, సెక్రటరీ పప్పు వెంకట్‌రెడ్డి, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం పేరెంట్, టీచర్ మీట్ నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాకేష్, రమేష్, అశోక్, నర్సయ్య, మంజుల, స్వప్న, సంధ్య, భాగ్యలక్ష్మి, శ్రీలత, పుష్పలత, రాధిక, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.