Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్ఎస్ఎస్ పీఓ రాజ్‌కుమార్
నవతెలంగాణ-కమలాపూర్
యువత సమాజంలో కీలక పాత్ర పోషించాలని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రాజ్‌కుమార్ ఆకాంక్షించారు. మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం నిర్వహించిన ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జాతిని జాగతపర్చి దేశాన్ని ఉజ్వల భవిష్యత్తులోకి నడిపించడంలో విద్యార్థులను భాగస్వామ్యులు చేసి వారి వ్యక్తిత్వ వికాసానికి పాటుపడడంలో ఎన్ఎస్ఎస్ పాత్ర అసామాన్యమని చెప్పారు ప్రిన్సిపాల్ సంపత్ కుమార్ మాట్లాడుతూ యువతలో క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం, సమాజ సేవ పెంపొందించడంలో ఎన్ఎస్ఎస్ పాత్ర క్రియాశీలకమని తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపక బందం పుష్పలత, కవిత, శ్రీదేవి, సాంబశివయ్య, సురేష్ బాబు, రాందాస్, కుమారస్వామి, శోభా దేవి, యామిని, జితేందర్, శ్రీనివాస్, సంధ్యారాణి కళాశాల సిబ్బంది, పోచక్క, కొండయ్య, శ్రీనివాస్, కరుణ, రాజయ్య, శ్వేత, విద్యార్థులు పాల్గొన్నారు.
మల్హర్రావు : మండల కేంద్రమైన తాడిచెర్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ దేవరాజ్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ పీఓ రవీందర్ మాట్లాడారు. విద్యాభ్యాసం విద్యార్థి ప్రధమ కర్తవ్యమని చెప్పారు. భావిభారతాన్ని నిర్ణయించాల్సింది యువకులేనని తెలిపారు. దేశ పురోభివద్ధిలోనూ యువత, విద్యార్థులే కీలకమన్నారు. మహాత్మ గాంధీ 100వ జయంతిని పురస్కరించుకొని ఎన్ఎస్ఎస్ డే నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు నరేందర్, ప్రవీణ్, వెంకటరెడ్డి, కరుణాకర్, స్వరూప, భరత్, జైపాల్, రవి, ఉమామహేశ్వరి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.