Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలి
- సీపీఐ(ఎం) జిల్లా కన్వీనర్ బొట్ల చక్రపాణి
నవతెలంగాణ-హనుమకొండ
కేంద్రంలోని బీజేపీ నిజామ్ తరహాలో ప్రజలపై పన్నుల భారం మోపుతోందని సీపీఐ(ఎం) జిల్లా కన్వీనర్ బొట్ల చక్రపాణి విమర్శించారు. పెంచిన నిత్యావసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని, ప్రజలపై జీఎస్టీని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హనుమకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం చేపట్టిన నిరసన కార్యక్రమంలో చక్రపాణి మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర సరుకుల ధరలను అడ్డుఅదుపు లేకుండా పెంచుతోందని విమర్శించారు. నిజామ్ పాలనలో జుట్టుపైనా, బట్ట పైనా, భూమి పైనా పన్ను వేయగా ప్రస్తుతం బీజేపీ పాలనలో పాలపైనా, పెరుగుపైనా, పప్పుపైనా, ఉప్పుపైనా, ఇతర నిత్యావసర సరుకులపైనా భారాలు మోపుతోందని మండిపడ్డారు. అలాగే ప్రభుత్వానికి లాభం చేకూర్చే ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, రైల్వే రంగాన్ని అప్పనంగా కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వామపక్ష పార్టీలు పోరాడి సాధించిన ఈజీఎస్ పథకాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, తదితర అనేక హామీలు గుప్పించి ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చి మోసపూరిత పాలన సాగిస్తోందంటూ కేంద్రంలోని బీజేపీ వైఖరిని ఎండగట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని ప్రజలకు పిలునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గాదె ప్రభాకర్‌రెడ్డి, వాంకుడోత్ వీరన్న, గొడుగు వెంకట్, ధరావత్ భానునాయక్, నాయకులు రవీందర్, అరుణ, ఉమ, భాగ్య, మంజుల, పావని, జగన, మానస, శ్రీమాత, శ్రీలత, శ్రీను, గోపి, స్వప్న, తదితరులు పాల్గొన్నారు.
అమరవీరుల స్తూపం వద్ద..
హన్మకొండ : అదాలతో సెంటర్లోని అమరవీరుల స్తూపం వద్ద సీపీఐ(ఎం) సౌత్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆలకుంట్ల యాకయ్య అధ్యక్షతన నిరసన కార్యక్రమం నిర్వహించగా మండల కమిటీ సభ్యులు నోముల కిషోర్, ఎన్నం వెంకటేశ్వర్లు మాట్లాడారు. కార్యక్రమంలో హన్మకొండ మండల కమిటీ సభ్యులు దూడపాక రాజేందర్, మేకల రఘుపతి, బొల్లరం సంపత్, కంచర్ల కుమరస్వామి, దాసరి నరేష్, మోతె సతీష్, రాంఖి, సంపత్, రమేష్, అలీ, కావ్య, శ్వేతా, రామ, రవళి, సంధ్యా, సుకర్ణ, విజయ, దుర్గా, రాణి, కరుణాకర్, కుమార్, రాము తదితరులు పాల్గొన్నారు.
శాయంపేట : సీపీఐ(ఎం) మండల కమిటీ ఆద్వర్యంలో తహసీల్దార్ చల్లమల్ల రాజుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు దొగ్గెల తిరుపతి మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు బొట్ల కుమార్, నక్క రాజు పాల్గొన్నారు.
కాజీపేట : తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ(ఎం) మండల కమిటీ ఆద్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కార్యదర్శి తొట్టె మల్లేశం మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు ఓరుగంటి సాంబయ్య, గద్దల బద్రి, గడ్డం అశోక్, కస్తూరి జ్యోతి, మట్టెడ లావణ్య, శాంతమ్మ, ఉమారాణి, అంజలి, ఆలియా, ఉమ్మడి ఎలిషా, సుమలత, రజిత, సరూప, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఐనవోలు : సీపీఐ(ఎం) మండల కమిటీ ఆద్వర్యంలో తహసీల్దార్ రాజేష్‌కు వినతిపత్రం అందించారు. ఈ ంసదర్భంగా ఆ పార్టీ మండల కార్యదర్శి కాడబోయిన లింగయ్య, నాయకుడు బండి పర్వతాలు మాట్లాడారు. కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు మాదాసు సలీమ్, రాజ్, పోచమ్మ, తదితరులు పాల్గొన్నారు.
పాలకుర్తి : సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ హసీనాకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కార్యదర్శి మాచర్ల సారయ్య మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సోమ సత్యం, నాయకులు సోమ అశోక్ బాబు, మాసంపల్లి నాగయ్య, బాణాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
స్టేషన్ ఘనపూర్ : సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం పార్టీ మండల కార్యదర్శి మునిగెల రమేష్ మాట్లాడారు. కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు మంద మహేందర్, చిలుముల్ల భాస్కర్, నాయకులు వంగపండ్ల సోమయ్య, శ్రీకాంత్, శాతపురం రవి, రాములు, శ్రీను, కే .భాస్కర్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.