Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
గర్భిణీలు, బాలింతలు అంగన్ వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పోషక విలువలు సంవద్దిగా ఉన్న ఆహారాన్ని తీసుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని జడ్పిటిసి జాటోత్ ఝాన్సీ లక్ష్మి,ముల్కనూర్ సర్పంచ్ వట్టం జానకిరాణి లు అన్నారు. పోషణ ఆహార వారోత్సవాలలో భాగంగా మండలంలోని ముల్కనూర్ పంచాయితీ సెక్టార్ ల లో శనివారం గర్భిణి స్త్రీలకు సామూహిక సీమంతాల కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల కోసం అనేక ప్రత్యేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని గర్భంలో ఉన్న పిల్లల నుండి వద్ధుల వరకు సంక్షేమ పథకాలు ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. తల్లి గర్భంలో ఉన్న తొమ్మిది నెలల పాటు తల్లికి సరైన పోషక పదార్థాలు తీసు కుంటే ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారని తెలిపారు. గర్భిణీలు, బాలింతలు, కిషోర బాలికలు పోషక విలువలతో కూడిన ఆకుకూరలు, కోడిగుడ్ల,పప్పు దినుసులు వంటి పోషకాహార పదార్థాలను తీసుకుంటే తల్లి ,పుట్టబోయే బిడ్డ లు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మాళోత్ వెంకట్ లాల్, డోర్నకల్ సి డి పి ఓ ఎల్లమ్మ , సూపర్ వైజర్ శారద,అంగన్ వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు,గర్భిణీ లు,బాలింతలు తదితరులు పాల్గొన్నారు.