Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తపాలా శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
నవతెలంగాణ-మట్టెవాడ
అన్ని దానాల్లో కెల్లా రక్తదానం గొప్పదని, రక్తదానంపై అపోహలు విడనాడి రక్త దానానికి ముందుకు రావాలని వరంగల్ పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్ కే రఘునాథస్వామి పిలుపునిచ్చారు. శనివారం తపాల శాఖ ఆధ్వర్యంలో వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ లో రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో నిర్వహించిన రక్తదాన శిబిరన్ని చందా కాంతయ్య మెమో రియల్ ప్రసూతి వైద్యశాల (సికేఏం) సూపరిండెంట్ నిర్మల తో కలిసి ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ ప్రమాదాల బారిన పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి దాతలు ఇచ్చే రక్త దానం ప్రాణాన్ని నిలబెడు తుందని,అలాగే రక్తహీనతతో బాధపడే తలేసేమియా బాధితులకు ప్రాణ దానం అవుతుందని అన్నారు. 27వ డివిజన్ కార్పొరేటర్ చింతాకుల అనిల్ కుమార్ మాట్లాడుతూ యువకులు రక్తదానం చేయడానికి ముందుకు రావా లని రక్తదానం చేస్తే మరొకరికి ప్రాణదాతలుగా నిలుస్తారని సూచించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకుడు చింతాకుల సునీల్, వరంగల్ పోస్టల్ డివిజన్ సహాయక పర్యవేక్షకులు ప్రీ ప్రభాకర్, ఇన్స్పెక్టర్ సుమన్ గౌడ్, హెడ్ పోస్ట్మాస్టర్ తిరుపతి, మెయిల్ ఓవర్సీర్లు, పోస్ట్మాన్లు తపాలా సిబ్బంది పాల్గొన్నారు.