Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెక్కొండ రూరల్
నిరుపేద కుటుంబాలకు, వ్యక్తులకు ఆసరా ఫించన్లను అందించి సీఎం కేసీఆర్ ఇంటి పెద్దగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. మండలంలోని అలంకానిపేటలో మంజూరైన పింఛన్ ధ్రువీకరణ పత్రాలు, కార్డులను సర్పంచ్ మాదాసు అనంతలక్ష్మి రవి, ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షులు కర్పూరపు శ్రీనివాస్, ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే లబ్ధిదా రులకు శనివారం పంపిణీ చేశారు. బతుకమ్మ కానుకగా ఆడపడుచులకు బతుకమ్మ చీరలు ఎమ్మెల్యే చేతుల మీదగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రమేష్ నాయక్, జెడ్పిటిసి సరోజన, సొసైటీ చైర్మన్ మారం రాము, గ్రామ సర్పంచ్ అనంతలక్ష్మి రవి, ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు కర్పూరపు శ్రీనివాస్, మాజీ మార్క్పైడ్ డైరెక్టర్ సూరం రాజిరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ గుంటుక సోమయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు చీకటి శ్రీనివాస్, ఉపసర్పంచ్ గుంటుక నర్సయ్య, యూత్ అద్యక్షులు గార్లపాటి నిరంజన్ రెడ్డి, సారంగం, వార్డు మెంబర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.