Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిరస్థాయిగా నిలిచి ఉన్న అమరత్వం
- సాధినేని వెంకటేశ్వరరావు
- బయ్యారంలో పాషా వర్ధంతి సభ
నవతెలంగాణ-బయ్యారం
అట్టడుగు వర్గాల ప్రజల కోసం చివరి శ్వాస దాకా పోరాడిన పాషా ప్రజల హదయాల్లో నిలిచిచాడని, ప్రతిఘటనా పోరాటాలను తీవ్రతరం చేసి పీడిత ప్రజలను విముక్తి చేయటమే ముక్తార్ పాషాకు అర్పించే ఘనమైన నివాళి అని సిపిఐ (ఎంఎల్) న్యూడెమోసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు అన్నారు. పాషా 2వ వర్ధంతి సందర్భంగా శనివారం బయ్యారం గాంధీ సెంటర్ లోని క్రీడామైదానంలో న్యుడేమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య అద్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ 75 సంవత్సరాల స్వతంత్ర పాలనలో దేశం అధోగతి పాలైందని, అన్ని వర్గాల ప్రజలు దోపిడి అణచి వేతలకు గురవు తున్నారని దీనికి అధికారంలో వున్న దళారీ పాలకులే కారణమన్నారు. దేశంలో ఆదివాసీ పైన దళితులపైన, మహిళలపైన, మైనారిటీలపైన దాడులు పెరిగి పోతున్నాయని, పేదల శ్రమను దోచి సామ్రాజ్యవాదులు పెడుతున్న స్థితిని ఎదిరిం చి పోరాడాలని ఆయన అన్నారు. ప్రతి ఘటనా పోరాటాలు లేకుండా చట్టాలు రాలేదని, నేడు దేశంలో వచ్చిన చట్టాలన్నీ ప్రజాపోరాట ఫలితమేనన్నారు. మార్క్సిజం లెనినిజం మావో ఆలోచనా విధానం వెలుగులో నిలకడ కలిగిన ప్రతిఘటనా పోరాటాలు నిర్మించాల్సిన అవసరం వుందని, అలాంటి పోరాటాలే పాలక వర్గాల దోపిడీకి అడుకట్ట వేయగలుగు తాయన్నారు. పాషా 40 ఏళ్లకు పైగా కార్మిక, కర్షక అణగారిన వర్గాల విముక్తి కోసం పోరాడాడన్నారు. ఆయన కృషి, పోరాట పటిమ ఉద్యమ కార్యకర్తలు ఎప్పటికీ మరవ లేరన్నారు. బడా బూర్జువా, భూస్వామ్య వర్గాలను, సామ్రాజ్య వాదులను ఓడించి సమసమాజాన్ని స్థాపించటానికి పాషా మార్గంలో పయనించాలని కోరారు. న్యూమో క్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె. గోవర్ధన్, పీఓడబ్యూ జాతీయ కన్వీనర్ వి.సంధ్యలు ప్రసంగిస్తూ పోడు భూములకు పట్టాలిస్తామని చెపుతున్న కేసీఆర్ ప్రభుత్వం ఆదివాసీ పోడు రైతుల పై దాడులెందుకు చేస్తున్నదని అన్నారు. కేసీఆర్ తప్పుడు చర్యలను హైకోర్టు కూడా తప్పు పట్టిందన్నారు. విప్లవ కారుల పోరాటాల ఫలితంగానే గిరిజనులకు పోడు భూములు దక్కాయని, వాటిని రక్షించుకొని, పట్టా హక్కులు సాధించుకోవటానికి సంఘటితంగా పోరాడాలన్నారు. ఈ సభలో పార్టీ ఏరియా కమిటీ నాయకులు మోకాళ్ల మురళీ కష్ణ, ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర అధ్య క్షులు ఆరెళ్లి క్రిష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె. సీతారామయ్య ప్రసంగించారు. సభకు ముందు తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం నుండి పురవీధుల గుండా భారీ ప్రదర్శన నిర్వహించారు. డప్పు, కోలాట బందాలు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాషా ఫొటోలతో, ఎర్ర జండాలతో ప్రదర్శన కొనసాగింది. ఈ కార్యక్ర మంలో పార్టీ ప్రజాసంఘాల నాయకులు దేశెట్టి రామచంద్రయ్య, గుజ్జు దేవేందర్, ఎస్.కె మదార్, శివారపు శ్రీధర్, ఊకె పద్మ, శ్రీశైలం బూర్క వెంకటయ్య, యదల్ల పల్లి సత్యం, బానోత్ ఊక్లా, రాసుద్దీన్, ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర సహాయ కార్యదర్శి అనూరాధ, అరుణోదయ రాష్ట్ర కార్యదర్శి నిర్మల, రాష్ట్ర నాయకులు తారాచంద్, బారి హరీష్, పంగరవి, సరళ, పి.డి.ఎస్.యు, పీవైఎల్ రాష్ట్ర నాయకులు నేతకాని రాకేశ్, తుడుం వీరభద్రం, మోకాళ్ళ రమేశ్, బోనగిరి మధు, ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర నాయకులు ఏపూరి వీరభద్రం, రాంసింగ్, సర్పంచ్ లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.