Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిపిఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్
నవతెలంగాణ-మహబూబాబాద్
పెంచిన ధరలను తగ్గించకపోతే కేంద్రంలో బిజెపి పతనం తప్పదని సిపిఎం జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ హెచ్చరించారు. శనివారం నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని తహసిల్దార్ కార్యాలయం ముందు సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లా డుతూ బిజెపి ఎనిమిది సంవత్సరాల పాలనలో ప్రజల నిత్యావసర వస్తువులు అయినా ప్రతిదీ ధరలు పెంచి పేద ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేసిందని ఆరోపించారు. పేద వాడి ప్రతి నిత్యావసర వస్తువు ధరను పెంచి మళ్ళీ దానిపై జీఎస్టీ వసూలు చేయడం సిగ్గుచేటు అన్నారు. కరోనా సమయంలో అనేకమంది ఆహారం దొరక్క ఉపాధి లేక జీవన విధానం అల్లకల్లోలమైన సమయంలో ఆదాని సంపద మాత్రం పది రెట్లు ఎక్కువగా పెరిగిందని ఇది బిజెపి కుట్రపూరిత పాలనా విధానానికి నిదర్శనమన్నారు. కేవలం అదా నీ కోసమే కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఎన్పిఏ పేరుతో ప్రభుత్వానికి అప్పు ఉన్నవారికి సడలింపు ఇవ్వడం ఏంటని విమర్శించారు. జిఎస్టి పేరుతో నెలకి లక్ష కోట్లు ప్రభుత్వానికి సమకూరుతున్నాయన్నారు. పోడు భూముల్లో గిరిజనులు ఆదివాసీలు అరెకరం ఎకరం సాగు చేసుకుంటే పోలీసులు అటవీ అధికారులు రంగంలోకి దిగిన నాన్న రభస చేస్తారు మరి ఇప్పుడు 5 వేల ఎకరాలు అంటే సుమారుగా ఐదు వేల మంది పేద గిరిజనుల జీవన విధా నాన్ని దెబ్బతీయడం సిగ్గుచేటన్నారు. సిపిఎం పోరాట ఫలితంగా రైతు చట్టాలను వెనక్కి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం మళ్లీ ప్రజలపై అధిక ధరలు మోపుతూ కాలం విడదీయడం పద్ధతేనా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి భానోత్ సీతారాం నాయక్, జిల్లా నాయకులు కుర్ర మహేష్, సమ్మెట రాజమౌళి అల్లి శ్రీని వాస్ రెడ్డి, బానోతు హేమ నాయక్ కుమ్మరి కుంట నాగన్న రావుల రాజు,బానోత్ వెంకన్న, గాడి పెళ్లి శ్యామ్, చారి,బేగం, తజ్జు, ప్రకాష్, ముఖ రంజాన్ హిమబిందు, కల్పన, అరుణ, కవిత ఏకాంబరం, సురేందర్, పాల్గొన్నారు
నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలి
కురవి : నిత్యావసర వస్తువుల ధరల కారణంగా పేద, మధ్య తరగతి ప్రజలు ఈ దేశంలో జీవించే హక్కును కోల్పోతున్నందున సిపిఐ (ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలో సిపిఐ(ఎం)రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసిల్దార్ ఇమ్మాన్యుయల్కి వినతి పత్రం అందజేశారు. సిపిఎం మండల కార్యదర్శి మల్లెడికోటయ్య మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. కార్యక్రమంలో, నల్లపు సుధాకర్, కట్ల కష్ణయ్య, మాలోత్ కిషన్, కాటిరాల కష్ణయ్య, నిమ్మిశెట్టి రామచంద్రరు, మల్లమ్మ, వసంత, తదితరులు పాల్గొన్నారు.
మరిపెడ : కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న నిత్యావసరాల ధరలు వెంటనే తగ్గించాలని సిపిఎం మండల కార్యదర్శి దుండి వీరన్న కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక బస్టాండ్ సెంటర్ లో జాతీయ రహదా రుల పై ఆందోళన నిర్వహించారు. సిపిఎం మండల కార్యదర్శి దుండి వీరన్న పాల్గొని మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యవసర సరుకులు బాగా పెంచినారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ధరలు తగ్గించాలని వారన్నారు. కార్యక్రమంలో నందిపాటి వెంకన్న, కొండ ఉప్ప లయ్య, వెంకన్న, సైదులు, ఉపేందర్, ఆటో వర్కర్స్ యూ నియన్ నాయకులు యాకూబ్ జానీ, పాల్గొన్నారు.